Sarkaru vari pata : సర్కారు వారి పాట Sarkaru vari pata కి కీర్తి సురేష్ ప్లస్సా..మైనస్సా..అన్న టాక్ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు ప్రేక్షకుల్లోనూ కలుగుతోందట. అందుకు కారణాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మహానటి సినిమా తర్వాత కీర్తిసురేష్ కి విపరీతంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ క్రేజ్ ని నిలుపుకోవడంలో కీర్తిసురేష్ సక్సస్ కాలేదంటున్నారు. అందుకు కారణం మహానటి సినిమా తర్వాత కోలీవుడ్ లో వరసగా సినిమాలు చేసింది. కాని భారీ హిట్ అన్నది దక్కలేదు.
అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో క్రేజ్ కాస్త తగ్గింది. అదే సమయంలో పూజా హెగ్డే, రష్మిక మందన్న, సాయి పల్లవి రేస్ లో ముందుకు దూసుకొచ్చారు. ఇది మరొక మైనస్. ఇక అన్నిటికంటే పెద్ద మైనస్ అంటే కీర్తి సురేష్ డైట్ ఫాలో అయి సన్నబడటం. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలలో కీర్తి చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి కూడా చూపించలేదు. నెటిజన్స్ నుంచి మాత్రమే ఇండస్ట్రీ వర్గాల నుంచి కీర్తి లో మార్పు చూసి షాకయ్యారు.
Sarkaru vari pata : సర్కారు వారి పాట లో కీర్తి సురేష్ బాగాలేదన్న మాట వినిపిస్తోంది..?
దాంతో బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బాగా పీలగా కనిపిస్తున్న కీర్తిసురేష్ ని మేకర్స్ కూడా మళ్ళీ ముందు మాదిరిగా బొద్దుగా తయారవమని సలహాలిచ్చారు. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాపయినా అందులో కీర్తిసురేష్ లుక్ పరంగా చాలా బావుంటుంది. మళ్ళీ ఆ లుక్ లోకి వచ్చేందుకు కీర్తిసురేష్ బాగా ట్రై చేస్తోంది. అయితే సర్కారు వారి పాట సినిమాకి కీర్తి ప్లసా..మైనస్సా అని ఇప్పుడు టాక్ మొదలైంది. మహేష్ ఏరేంజ్ లో ఉంటాడో ఇప్పటికే లీకైన పిక్స్ లో అర్థమవుతోంది. కాని ఆయన పక్కన కీర్తి సురేష్ బాగాలేదన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి సినిమా రిలీజయ్యాక కీర్తి కి ఎలాంటి కామెంట్స్ వస్తాయో.