క్రిష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కంచె. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించగా జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ ని చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించింది..టాలీవుడ్ లో పక్కా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కంప్లీట్ ట్రెడీషనల్ గా ఈ సినిమాలో నటించిన ప్రగ్యా జైస్వాల్ కి ఇండస్ట్రీలో ప్రముఖుల నుండి గొప్ప ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ చాలా చక్కగా ఉంది ..బాగా నటించింది అంటూ పొగిడేశారు.
కాని ఎందుకనో ఇండస్ట్రీలో ప్రగ్యా జైస్వాల్ గట్టిగా నిలబడ లేకపోయింది. తన తర్వాత వచ్చిన రష్మిక మందన్న లాంటి వాళ్ళు వరసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంటే ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. చెప్పాలంటే కంచె కంటే ముందు ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికి క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమాతోనే అందరి దృష్ఠిని ఆకర్షించింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ఓ నమో వేంకటేశాయ సినిమాలో నటించింది. దాంతో ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ కి ఢోకా ఉండదనుకున్నారు.
కాని అది కూడా వర్కౌట్ కాలేదు. గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర…ఇలా ఏదో వచ్చిన అవకాశాన్ని అందుకుంది గాని సక్సస్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. నక్షత్రం..జయ జానకి నాయక సినిమాలలో తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపించింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పటికి ఈ కంచె భామ ఏమాత్రం డిసప్పాయింట్ అవకుండా ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీఈయాలో ఫ్యాన్స్ కి చమటలు పట్టిస్తోంది. మరి తనలోని ఇంత గ్లామర్ ని ఏ దర్శకుడు సరిగ్గా చూడలేదా ఏమో మరి. కనీసం తనకి సూపర్ హిట్ ఇచ్చిన క్రిష్ అయినా మరో సినిమా అవకాశం ఇచ్చి ఫాం లోకి తీసుకు వస్తే బావుంటుంది.