రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెబితే .. డైరెక్టర్ క్రిష్ ఎందుకు కంగారు పడుతున్నాడు ?

స్టార్ డైరెక్టర్ క్రిష్ – మెగా హీరో వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం లో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని క్రిష్ టార్గెట్ పెట్టుకున్నాడు. అందుకే క్రిష్ కి కావలసినట్టుగా బల్క్ డేట్స్ ఇచ్చింది రకుల్. కాని ఇప్పుడు క్రిష్ అనుకున్న ప్లాన్ అన్నీ తారుమారయ్యేలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

Krish disturbed! Reason Rakul Preet Singh - tollywood

ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ పేరు బయటకి రావడంతో ఎన్సీబీ అధికారుల ముందు హాజరయింది. దాంతో కొన్నాళ్ళు ముంబై లోనే రకుల్ ఉండాల్సి వస్తుందంటున్నారు. అందుకే క్రిష్ సినిమా షూటింగ్ కి టెన్షన్ మొదలయ్యింది. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ఫినిష్ చెయ్యాలని క్రిష్ ప్లాన్ చేశారు. కానీ, డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వుండటంతో అది కుదిరేలా కనిపించడం లేదు. ఆల్రెడీ ఒకసారి నార్కోటిక్స్ బ్యూరో ముందు రకుల్ అటెండ్ అయ్యింది. దాంతో సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమాని స్టార్ట్ చేయాలనుకున్న క్రిష్ కి అది సాధ్యపడటం కాస్త కష్టమే అంటున్నారు.

అంతేకాదు బాలీవుడ్ లో రెండు సినిమాలతో పాటు కోలీవుడ్ లో శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ అన్న పాన్ ఇండియన్ సినిమాని చేస్తుంది. ఇప్పుడు క్రిష్ తో పాటు ఈ సినిమాల మేకర్స్ పరిస్థితి అయోమయంలో పడిందని మాట్లాడుకుంటున్నారు. అయితే ముంబై నుంచి రకుల్ వచ్చి మళ్ళీ క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొందని సమాచారం. అయినా మరోసారి రమ్మని ఎన్సీబీ అధికారులు పిలిస్తే వెళ్ళక తప్పదు. మళ్ళీ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుందని… క్రిష్ ఫీలవుతున్నాడట. ఇది పోవాలంటే రకుల్ వీలైంత త్వరగా రకుల్ ఈ డ్రగ్స్ వ్యవహారం నుంచి బయట పడితే క్రిష్ అంత త్వరగా రిలాక్స్ అవుతాడని చర్చించుకుంటున్నారు.