Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ‘చావుకబురు చల్లగా’ తర్వాత సర్దేసుకున్నట్టేనా..? కొన్ని సినిమాలను ఎందుకొప్పుకుందో పాపం..!

Share

Lavanya Tripathi: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, గానీ, హీరోయిన్స్ గానీ కొన్ని సినిమాలను ఎందుకొప్పుకుంటారో కూడా అర్థం కాదు. వీరు మాత్రమే కాదు, కొన్ని సినిమాలను దర్శకులెందుకు తీయాల్సి వస్తుందో, నిర్మాతలు కోట్లు ఎందుకు ఖర్చు పెట్టి సినిమాలను నిర్మించి నష్టపోతారో ప్రత్యేకించి కారణాలను చెప్పలేరు. దానివల్ల ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామందే ఉన్నారు. స్టార్ హీరోయిన్స్‌గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్స్ డబ్బు కోసమో, లేక మొగమాటానికి పోయో సినిమాలను ఒప్పుకొని కెరీర్‌ని చిక్కుల్లో పడేసుకుంటున్నారు.

is lavanya-tripathi-waiting for the chances after chaavu kaburu challaga
is lavanya-tripathi-waiting for the chances after chaavu kaburu challaga

కారణాలేమైనా ఇప్పుడు లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా ఇలానే ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది సొట్ట బుగ్గల సోగయం లావణ్య త్రిపాఠి. మొదటి సినిమా యావరేజ్ అనే టాక్ దగ్గరే ఆగిపోయినా ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఈమె బాగా నచ్చేసింది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాను ప్రమోట్ చేయడం కూడా లావణ్యకి టాలీవుడ్‌లో కలిసి వచ్చింది. ఈ సినిమా తర్వాత మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా అనే సినిమా చేసింది. ఈ సినిమా ఈమెకి మంచి హిట్ ఇచ్చింది.

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠికి కెరీర్ ప్రారంభంలో మంచి సూపర్ హిట్సే పడ్డాయి.

ఇలా మొదటి రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఇక లావణ్య టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ అందరు అనుకున్నంత సాఫీగా ఆమె కెరీర్ సాగడం లేదు. లావణ్య త్రిపాఠి కంటే తర్వాత వచ్చిన పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇటు సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా వెలుగుతూ నార్త్ మీద దండ యాత్రకి సిద్దమైతే ఈమె మాత్రం మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. చెప్పాలంటే లావణ్య కెరీర్ ప్రారంభంలో మంచి సూపర్ హిట్సే పడ్డాయి.

మనం లాంటి మల్టీస్టారర్‌లో భాగమవడం, ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ లాంటి బ్లాక్ బస్టర్స్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుందని టాక్ వినిపించింది. అయితే శ్రీరస్తు శుభమస్తు సినిమా సక్సెస్ తర్వాత లావణ్య కెరీర్ కాస్త నెమ్మదించింది. మిస్టర్, రాధ, ఉన్నది ఒకటే జిందగీ, యుద్దం శరణం లాంటి సినిమాలు చేసినా అవి ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరడంతో లావణ్య రేస్‌లో వెనకబడింది. ఈ సినిమాలలో రెండు మూడు సినిమాలు భారీ హిట్ సాధించినా ఇక కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకునేది కాదేమో.

Lavanya Tripathi: అలా జరగకపోవడం లావణ్యకి ఇబ్బందులు మొదలయ్యాయి.

కానీ అలా జరగకపోవడం లావణ్యకి ఇబ్బందులు మొదలయ్యాయి అని అంటున్నారు. ఇంటలిజెంట్, అంతరిక్షం మీద నమ్మకాలు పెట్టుకుంటే ఆ సినిమాలు కూడా ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. కొంత గ్యాప్ తర్వాత అర్జున్ సురవరం సినిమా చేసి ఓ మోస్తరు హిట్ అందుకొని మళ్ళీ ట్రాక్ ఎక్కింది అనుకుంటే ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలు లావణ్యని మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. చావు కబురు చల్లగా సినిమా హిట్ అవుతుందని చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఇదేదో డిఫ్రెంట్ కాన్సెప్ట్ అని సినిమా రిలీజ్‌కి ముందు ప్రేక్షకులు కూడా అనుకున్నారు.

కానీ ఈ సినిమాలో లావణ్య పాత్ర జనాలకి ఎంతమాత్రం నచ్చలేదు. మరీ డీ గ్లామర్ రోల్‌లో ఆమెని అభిమానులు చూడలేకపోయారు. ప్రస్తుతం లావణ్య చేతిలో సినిమాలేవీ లేవనే సమాచారం. అయితే ఎప్పుడూ..ఏ సినిమాలోనూ మితి మీరి నటించకపోవడంతో లావణ్యకి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌లో యూత్ ఆడియన్స్‌లో మంచి పేరు, క్రేజ్ ఉంది. మళ్ళీ సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు రెండు పడితే కెరీర్ ఊపందుకుంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Related posts

పీసీసీ పీఠంపై రేవంత్ రెడ్డి … జ‌గ్గారెడ్డి ఇదే చెప్తున్నారా?

sridhar

ఏపికి విస్తరించిన బర్డ్‌ఫ్ల్యూ.. ! కర్నూలు జిల్లాలో పిట్టల్లా రాలిపోతున్నకోళ్లు..!!

somaraju sharma

Tollywood: డైరెక్టర్ బుచ్చిబాబు సన పుట్టిన స్టోరీ మొదట ఎవరికి వినిపించాడో తెలుసా..??

sekhar