Liger : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’. పూరి – విజయ్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుస్తున్న ఈ మూవీకి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే వెరైటీ ట్యాగ్ లైన్ పెట్టి పూరి సినిమా మీద భారీగా అంచనాలు పెంచేశారు. ఈ సినిమాను బాక్సింగ్ బ్యాక్ డ్రాప్తో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేసి హాట్ టాపిక్
క్రియేట్ చేశాడు.
ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలిపాడు. అది కూడా లైగర్ సినిమా కోసమే అని అంటున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో లో ‘మీ అబ్బాయి తిరిగి వచ్చాడు – వర్క్ ఫ్రమ్ హోమ్.. విషయాలను కదిలిద్దాం” అంటూ ట్వీట్ చేస్తూ, ఒక ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫోటోలో విజయ్ మైక్ ముందు నిలబడి చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకొని చదువుతున్నట్టు కనిపించాడు. దీంతో విజయ్ దేవరకొండ ఇంటి నుంచే డబ్బింగ్ చెప్పడం మొదలు
పెట్టినట్టు అర్థమవుతోంది. అంతేకాదు ఖచ్చితంగా ‘లైగర్’ టీజర్ కోసమే అని విజయ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
Liger : లైగర్ సినిమా టీజర్ కోసమా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.
ఇప్పటికే దాదాపు అన్నీ సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. కానీ పూరి – విజయ్ సినిమా లైగర్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అయితే తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోలో ఇంట్లో ఉండి డబ్బింగ్ చెబుతున్నాడంటే అది కమర్షియల్ యాడ్ కోసమే అని కొందరు చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజంగా కమర్షియల్ యాడ్ కోసమా లేక లైగర్ సినిమా టీజర్ కోసమా అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. సాధారణంగా ఇలాంటి పిక్ షేర్ చేయగానే
లైగర్ మేకర్స్ నుంచి హింట్స్, కామెంట్స్ వచ్చేస్తాయి. అయితే భారీ సర్ప్రైజ్ ఇవ్వాలని కూడా పూరి టీం సీక్రెట్ మెయిన్టైన్ చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అందరూ లైగర్ అప్డేట్ కోసం మాత్రం బాగా ఆతృతతో ఉన్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ – పూరి జగన్నాథ్ – ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.