Pushpa : పుష్ప..ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. ఇంతకాలం స్టైలిష్ స్టార్‌గా పిలుచుకున్న అల్లు అర్జున్‌ని ఈ సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా కన్నడ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. పార్ట్ 2 లో యంగ్ బ్యూటీ నివేథా థామస్ నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలెట్‌గా నిలవనుందని ప్రచారం జరుగుతోంది.
ఇక ఈ సినిమాను దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఇందులో ఉన్న హై ఓల్టేజ్ ఐటెం సాంగ్ కోసం పూజా హెగ్డే లేదా బాలీవుడ్ బ్యూటీస్ ఊర్వశీ రౌతెలా, దిశా పఠాని పేర్లు పరిశీలిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాలో లవర్ బాయ్‌గా ఒకప్పుడు వరుస సినిమాలు చేసి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న తరుణ్ భాగం కానున్నాడని తెలుస్తోంది. నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరుణ్ వరుసగా సూపర్ హిట్స్ అందుకున్నాడు.
Pushpa : పుష్ప సినిమాలోనూ ఫహద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్..?
అయితే ఒక్కసారిగా కెరీర్ డౌన్ ఫాల్ అయి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. ఆ మధ్య ఓ సినిమా చేసినా అది వచ్చినట్టు ఏ ఒక్కరికీ గుర్తు లేదు. అయితే పుష్ప సినిమాలో తరుణ్ స్క్రీన్ మీద కాకుండా బ్యాక్ ఎండ్‌లో ఉండి తన వాయిస్ వినిపించబోతున్నట్టు సమాచారం. ఇటీవల ఆహాలో రిలీజైన మలయాళ డబ్బింగ్ సినిమా ‘అనుకోని అతిథి’లో ఫహద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. అలాగే ఇప్పుడు పుష్ప సినిమాలోనూ ఫహద్ ఫాజిల్ పాత్రకు తరుణ్ డబ్బింగ్ చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!