Ram : రామ్ సినిమాతో మాధవన్ ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను పోగొట్టుకుంటాడా..?

Share

Ram : ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రెడ్ తో వచ్చిన రామ్ అంతగా మెప్పించలేకపోయాడు. అయినా తన నెక్స్ట్ సినిమాను వెంటనే సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నాడు. మరోసారి మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించబోతున్నాడు. తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

is madhavan going to act in ram movie...?
is madhavan going to act in ram movie…?

కాగా ఇందులో ఆర్.మాధవన్ రామ్ ని ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తాయి. తాజాగా వస్తున్న ఈ వార్తలపై రామ్ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారట. అందుకు కారణం మాధవన్ నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో హిట్ అయిన దాఖలాలు లేవు. సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాలో కూడా నెగటివ్ రోల్ చేశాడు. కానీ ఈ సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక తెలుగులో మాధవన్ ని తీసుకోవడం కష్టమే అనుకున్నారు.

Ram : మాధవన్ ఇప్పుడు భారీ ఫైట్స్ చేయగలడా..?

కానీ రామ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలో మాధవన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఇందులో మాధవన్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడట. తెలుగులో ఈ మధ్య మాధవన్ చేసిన రోల్స్ క్లాస్‌గా డిజైన్ చేసినవి. అయితే తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమా అంటే పక్కా మాస్ ఎంటర్‌టైనర్. హీరో అయినా, విలన్ అయినా మాస్‌గా ఉంటారు. ఫైట్స్ చేయాల్సి ఉంటుంది. మరి మాధవన్ ఇప్పుడు భారీ ఫైట్స్ చేయగలడా చూడాలి. అంతేకాదు మాధవన్ కి టాలీవుడ్‌లో నెగిటివ్ సెంటిమెంట్ పోతుందా లేదా చూడాలి.


Share

Related posts

బ్రేకింగ్ : నిమ్మగడ్డ కేసులో జగన్ కి సుప్రీం మళ్ళీ షాక్…!

Srinivas Manem

బాబు జైలు కి అంటున్న వైసీపీ మంత్రి..!!

sekhar

Sonu Sood: తనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పిన సోనుసూద్..!!

sekhar