Boyapati srinu: బోయపాటి శ్రీనుతో మహేశ్ బాబు సినిమా ఎందుకు డ్రాపయిందంటే..?

Share

Boyapati srinu: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్ మహారాజ రవితేజతో తెరకెక్కించిన భద్ర సినిమాతో దర్శకుడిగా మారాడు. మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. మొదటి సినిమాతోనే మంచి యాక్షన్ సినిమా దర్శకుడు అని బోయపాటి శ్రీను ఇటు ఇండస్ట్రీ వర్గాలలోనూ, అటు ప్రేక్షకులలోనూ పేరు తెచ్చుకున్నారు. ఈ
సినిమా తర్వాత విక్టరీ వెంకటేశ్‌తో తులసి, నందమూరి బాలకృష్ణతో సింహ సినిమాలు తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. హీరోను హై ఓల్టెజ్‌తో చూపించడం దర్శకుడిగా బోయపాటికి బాగా కలిసి వచ్చింది.

is-mahesh-babu-dropped-boyapati-srinu-movie-because-of-this
is-mahesh-babu-dropped-boyapati-srinu-movie-because-of-this

దాంతో అందరూ హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు విపరీతంగా ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా దమ్ము అనే సినిమా తీశాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బోయపాటికి మొదటి ఫ్లాప్ వచ్చి చేరింది. ఆయన గత చిత్రాల మాదిరిగానే మేకింగ్ ఉన్నప్పటికి తారక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ దమ్ము సినిమాలో కథ సరిగ్గా లేకపోవడంతో అందరినీ బాగా నిరాశపరచింది.

Boyapati srinu: లెజెండ్ సినిమా ఆయనకి లైఫ్ ఇచ్చిందంటే ఆ క్రెడిట్ దర్శకుడు బోయపాటిదే.

ఈ సినిమా తర్వాత మళ్ళీ బాలయ్యతో బోయపాటి శ్రీను లెజెండ్ సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒక్క ఫ్లాప్ వస్తే దానీ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకున్న బోయపాటి దాన్ని అందరూ మర్చిపోయేలా లెజెండ్ సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో కూడా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఇక సీనియర్ హీరో జగపతి బాబుకి మంచి రీ ఎంట్రీ సినిమాగా లెజెండ్ నిలిచింది. దాదాపు అందరూ జగపతి బాబు కెరీర్ అయిపోయిందనుకుంటున్న సమయంలో లెజెండ్ సినిమా ఆయనకి లైఫ్ ఇచ్చిందంటే ఆ క్రెడిట్ దర్శకుడు బోయపాటిదే.

ఇదే ఊపుతో అల్లు అర్జున్ హీరోగా సరైనోడు సినిమా చేసి మరో సాలీడ్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీలా నిలిచింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమా చేయాలనుకున్నారట బోయపాటి శ్రీను. వెళ్ళి కథ కూడా చెప్పారట. అయితే ఎందుకనో బోయపాటి కథ చెప్పే విధానం బాబును ఇంప్రెస్ చేయలేకపోయిందని టాక్ వచ్చింది. అందుకనే కాసేపు కథ విన్న మహేశ్ ..మళ్ళీ కలుద్దామని చెప్పాడట. కానీ మళ్ళీ ఇంతవరకు మహేశ్..బోయపాటికి ఛాన్స్ ఇవ్వలేదు. ఫ్యూచర్‌లో ఇస్తాడేమో చూడాలి.

Boyapati srinu: బహుషా ఇదే మహేశ్ కి జరుగుతుందనే కారణంతో అప్పుడు రిజెక్ట్ చేసి ఉంటాడా..?

అయితే మహేశ్‌తో బోయపాటి చేయాలనుకున్న కథే వినయ విధేయ రామ అని చెప్పుకున్నారు. మహేశ్ నో చెప్పిన కథనే చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బహుషా ఇదే మహేశ్ కి జరుగుతుందనే కారణంతో అప్పుడు రిజెక్ట్ చేసి ఉంటాడని వినయ విధేయ రామ సినిమా రిజల్ట్ తర్వాత అందరూ చెప్పుకున్నారు. కాగా ఇప్పుడు బాలయ్యతో హ్యాట్రిక్ మూవీగా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు బోయపాటి శ్రీను. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.


Share

Related posts

ఈ పంటలు వేశారంటే లక్షలు సంపాదించచ్చు.. ఏంటో ఒకసారి చూడండి!

Teja

Revanth Reddy: రాహుల్‌తో క‌లిసి త‌న రేంజ్ ఏంటో చూపించ‌నున్న రేవంత్

sridhar

Telangana : తెలంగాణలో అడ్వకేట్ల టైం అస్సలు బాగాలేదు !చావు అంచుకు వెళ్లి వచ్చిన మరో న్యాయవాది !!

Yandamuri