న్యూస్ సినిమా

Mastro : మాస్ట్రో రిలీజ్ కూడా ఓటీటీలో..?

Share

Mastro : కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటం వల్ల టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెకండ్ వేవ్ తర్వాత తాజాగా వెంకటేశ్ నటించిన నారప్ప సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైం లో రిలీజ్ అయింది. వెంకీ మార్క్ పర్ఫార్మెన్స్ తో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. రీమెక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ పడిందని చెప్పుకుంటున్నారు.

is mastro-release  in OTT....?
is mastro-release in OTT….?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ రీమేక్ సినిమాతో ప్రియమణి తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. సురేష్ బాబు, కలై పులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించారు. సెకండ్ వేవ్ తర్వాత ఓటీటీ రిలీజ్ అయిన పెద్ద సినిమాగా నారప్ప ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నారప్ప సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కి హిట్ అనే మాట వినబడటంతో మరికొన్ని పెద్ద సినిమాలను ఓటీటీ బాట పట్టించాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. థియేటర్స్ ఓపెన్ అయినా ప్రేక్షకులు ఎంతవరకు వస్తారో క్లారిటీ లేని కారణంగా డిజిటల్ ప్లాట్ ఫాం కి వెళుతున్నారు.

Mastro : మాస్ట్రో బాలీవుడ్‌లో రూపొందిన అంధాధున్ రీమేక్ గా తెరకెక్కింది.

ఈ క్రమంలో యూత్‌స్టార్ నితిన్ నటించిన మాస్ట్రో కూడా ఆగస్టు నెలలో ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో నితిన్ పియానో ప్లేయర్‌గా నటిస్తుండటంతో పాటు బ్లైండ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ హీరోయిన్ పాత్రలో, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించారు మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతున్న మాస్ట్రో ఆగస్టు 15న ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కి డీల్ కుదిరిందట. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా మాస్ట్రో బాలీవుడ్‌లో రూపొందిన అంధాధున్ రీమేక్ గా తెరకెక్కింది.


Share

Related posts

Sri Divya Blue Saree Stills

Gallery Desk

ఏపీ, తెలంగాణ హైకోర్టులకు జడ్జీలు వీరే!

Siva Prasad

Pushpa : పుష్ప కోసం అల్లు అర్జున్ అంత కష్టపడుతున్నాడంటే కేవలం సుకుమార్ కోసమే ..!

GRK