NewsOrbit
న్యూస్ సినిమా

Meena: సీనియర్ హీరోయిన్ మీనాకి సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉందా..?

Meena: సీనియర్ హీరోయిన్స్‌లో ఓ వెలుగు వెలుగుతుంది మీనా. పెళ్ళికాక ముందు తెలుగు, తమిళ భాషలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఆందుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు, జగపతి బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి ఫాం ని కొనసాగింది. ఇక తమిళంలో రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోలతో నటించి పాపులారిటీని తెచ్చుకుంది. మలయాళంలోనూ మోహన్ లాల్, మమ్ముట్టి సరసన నటించిన మీనా అక్కడ కూడా క్రేజ్ తెచ్చుకున్నారు.

is meena has second innings in her career...?
is meena has second innings in her career

అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరం అవుతారు. లేదా చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని అక్క, అమ్మ పాత్రలతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంటారు. కానీ మీనాకి అసలు గ్యాప్ వచ్చిందా అంటే నో అనే అంటున్నారు. అందుకు కారణం మీనా ప్రస్తుతం చేస్తున్నప్రాజెక్ట్స్ అలాంటివి కాబట్టి. ఇప్పటికీ తరగని అందంతో మీనా మంచి క్రేజీ హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటోంది. అంతకముందు చేసిన గ్లామర్ పాత్రలను కాకుండా హోంలీ పాత్రల్లో నటిస్తోంది. హుందాతనంతో కూడుకున్న పాత్రలలో నటించే అవకాశాలు దక్కించుకోవడం విశేషం.

Meena: మీనా తప్ప మరెవరూ సూటెవరూ కారని చెప్పుకుంటున్నారు.

అంతేకాదు ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా రీమేక్‌లో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవడం ఇక్కడ గొప్ప విషయం. మలయాళంలో మోహన్ లాల్ సరసన దృశ్యం సినిమాలో నటించింది మీనా. ఈ సినిమా మీనాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాదు. మీనా అకౌంట్‌లో హీరోయిన్‌గా హిట్ కూడా చేరింది. అదే సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ సరసన నటించే అవకాశం అందుకుంది. దృశ్యం సినిమా తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్లో మీనా అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తోంది.

ఇక ఇటీవల మోహన్ లాల్ సరసన మలయాళంలో వచ్చిన దృశ్యం సీక్వెల్ దృశ్యం 2లోనూ మీనానే హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇదే సినిమా తెలుగు రీమేక్ కూడా రూపొందింది. ఈ సీక్వెల్‌లోనూ హీరో, హీరోయిన్స్‌గా వెంకటేశ్ – మీనా నటించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇప్పటికే చిత్రబృందం ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. ఈ రకంగా అటు మలయాళంలో, ఇటు తెలుగులో వరుసగా హిట్స్ అందుకుంటూ కొన్ని పాత్రలకి మీనా తప్ప మరెవరూ సూటవరని చెప్పుకుంటున్నారు.

Meena: ఈ ఏడాదిలో మీనా అకౌంట్‌లో మూడు హిట్స్ పడినట్టు.

ఇప్పుడు తమిళ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాతో. ఆయన నటిస్తున్న సినిమా అణ్ణాత్త. ఇందులో మీనా ముఖ్య పాత్ర పోషిస్తోంది. నయనతార హీరోయున్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, ఖుష్బూలతో పాటు మీనా నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా అణ్ణాత్త రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే ఈ ఏడాదిలో మీనా అకౌంట్‌లో మూడు హిట్స్ పడినట్టు. ఈ రకంగా చూస్తే మీనా కెరీర్‌లో గ్యాప్ రానట్టే అనుకోవాలి. ఇలా సినిమాలు చేస్తూనే మధ్యలో అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా మీనా సందడి చేస్తోంది. అలా కూడా మీనా కెరీర్ బిజీగా సాగుతోంది.

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri