మెగా హీరో డేరింగ్ స్టెప్ హ్యాట్రిక్ హిట్ కోసమేనా ..?

మెగా సాయి ధరమ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని వరసగా హిట్ సినిమాలు చేస్తూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోలలో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. ఈ యంగ్ హీరో నటించిన సినిమాతో నిర్మాత సేఫ్ గా ఉంటున్నాడు. అందుకే నిర్మాతలు సాయి ధరమ్ తేజ్ తో సినిమా తీసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు.

solo brathuke so better full movie download leaked by movierulz

ఇక చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాలతో రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని కసిగా ఉన్నాడు. డెబ్యూ డైరెక్టర్ సుబ్బు తెరకెక్కించిన “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ తో పాటు ఫ్యాన్స్ .. ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకొన్నాడు.

వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా క్లీన్ యూ తో సెన్సార్ ను పూర్తి చేసుకొని థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. అంతేకాదు త్వరలో థియేటర్స్ కూడా తెరుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ కి రెడీ గా ఉన్న చాలా సినిమాలు సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్దమవుతున్నాయి. దాంతో అందరికంటే ముందే సాయి తేజ్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని సమాచారం.

ఈ ఏడాది చివరలో అంటే క్రిస్మస్ కే “సోలో బ్రతుకే సో బెటర్” రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇది కాస్త రిస్కే అన్న మాట వినిపిస్తుంది. థియోటర్స్ తెరిచినా కూడా అప్పటికి పరిస్థితులు చక్కబడతాయా అని అంటున్నారట. మరి సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ హిట్ కోసం రిస్క్ చేస్తున్నట్టే లెక్క. చూడాలి మరి ఏం జరుగుతుందో.