Uppena : ఉప్పెన Uppena సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది. దాదాపు ఈ సినిమాకోసం మెగా అభిమానులు.. ప్రేక్షకులు సంవత్సరం నుంచి వేయిట్ చేస్తున్నారు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ vishnav tej డెబ్యూ సినిమా కావడం తో అందరి చూపు ఉప్పెన సినిమా మీదే ఉంది. అంతేకాదు భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ గనక ఈ సినిమా ని రిలీజ్ చేయాలనుకుంటే ఎప్పుడో రిలీజ్ చేసి ఉండేవారు. ఓటీటీ నుంచి అలాంటి బంపర్ ఆఫర్ వచ్చింది. కాని మెగా హీరో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సినిమా కాబట్టి దర్శక, నిర్మాతలు ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకున్నారు.
కాగా ఈ సినిమాని ఈ నెల 12 న భారీ స్థాయిలో రిలీజ్ చేసున్నారు. ఈ సినిమా ద్వారా యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా మారుతున్నాడు. ఉప్పెన సినిమా కథ మాటలు స్క్రీన్ ప్లే మొత్తం దర్శకుడు బుచ్చిబాబు సానా నే సిద్దం చేసుకున్నాడట. కథ కథనాలు అద్భుతంగా కుదిరాయి. వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాకి పర్ఫెక్ట్ స్టోరీ. అయితే ఈ కథ విన్న లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి క్లైమాక్స్ విషయంలో కొన్ని కీలక మార్పులు సూచించారట.
Uppena : క్లైమాక్స్ లో కొన్ని మార్పులు సుకుమార్ చేశాడట..!
దాంతో చిరంజీవి సూచనల మేరకు ఆ మార్పులు సరి చేసేందుకు తన శిష్యుడికి సహాయం చేసేందుకు ఏకంగా దర్శకుడు సుకుమార్ రంగంలోకి దిగాడట. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు రాసుకున్న ప్రకారం క్లైమాక్స్ విషాదంగా ముగుస్తుందట. అయితే తెలుగు ప్రేక్షకులు విషాదకరంగా ఉండే క్లైమాక్స్ ని ఇష్టపడరని చిరంజీవి చెప్పారట. దీంతో.. క్లైమాక్స్ లో కొన్ని మార్పులు సుకుమార్ చేశాడట. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ తోపాటు డైలాగ్స్ కూడా సుకుమార్ రాసి ఇచ్చాడని సమాచారం. ఏదేమైనా ఈ సినిమా సక్సస్ అయితే ఖచ్చితంగా మెగాస్టార్ తో పాటు సుకుమార్ కి కాస్త క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.