నాగ చైతన్య గత కొంత కాలంగా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్కో సినిమా కథ విషయంలో నాగ చైతన్య ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. నాగ చైతన్య – సమంత కలిసి మజిలీ అన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పెళ్ళి తర్వాత నాగ చైతన్య – సమంత కలిసి నటించిన మజిలీ ఇద్దరి అకౌంట్ లో మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత సమంత ఓ బేబీ, జాను సినిమాలు చేసింది. కాని నాగ చైతన్య మాత్రం ఏ సినిమా కమిటవలేదు.
అందుకు కారణం నాగ చైతన్య కి కథ నచ్చకపోవడమే. ఎట్టకేలకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాని కంప్లీట్ చేశాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక నాగ చైతన్య – సాయి పల్లవి ల మధ్య కూడా మంచి రొమాంటిక్ లవ్ ట్రాక్ ఉంటుందట. ఈ సినిమాలో మేయిన్ హైలెట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 14 న రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక నాగ చైతన్య ప్రస్తుతం మనం ఫేం విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. మనం సినిమా తర్వాత విక్రం కుమార్ కి మళ్ళీ భారీ హిట్ దక్కలేదు. అయినా నాగ చైతన్య విక్రం కుమార్ తో సినిమా చేయడానికి హాకీ బ్యాక్ డ్రాప్ లో విక్రం కుమార్ చెప్పిన కథే కారణం అని చెప్పుకుంటున్నారు. మజిలీ సినిమా కూడా క్రికెట్ ఆట నేపథ్యంలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు తెరకెక్కుతున్న థాంక్యూ కూడా హాకీ ఆట నేథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాతో కూడా బాగ చైతన్య భారీ హిట్ అందుకోవడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా చూస్తే నాగ చైతన్య ఎక్కువగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.