Nagababu: నాగబాబు అనవసరంగా నిర్మాత అయ్యాడా..హీరో అయుంటే..?

Share

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాదిరిగా హీరో అయుంటే బావుండేదా.. అవును అలా అయితే హీరోగా మంచి క్రేజ్ ఉండేదేమో అని మెగాభిమానులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సందర్భంలో తను కూడా నాలాగా హీరో అయితే బావుండేదేమో.. అనవసరంగా నిర్మాతను చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుందని చెప్పుకొచ్చారట. దానికి కారణాలు కూడా లేకపోలేదు. కెరీర్ ప్రారంభంలో నాగబాబు కొన్ని సినిమాలలో మంచి పాత్రలు కూడా పోషించారు.

ఆ పాత్రలు నాగబాబుకి చాలా మంచి పేరు తీసుకువచ్చాయి. అప్పుడే వరుసగా హీరో పాత్రలకి గట్టిగా ప్రయత్నించి ఉంటే బావుండేమో. అన్నయ్య, తమ్ముడిలా ఈ రోజు ఆయనకి ఓ రేంజ్ ఉండేది. కానీ నిర్మాతగా మారి కెరీర్ ఇబ్బందుల్లో పడేసుకున్నారనేది కొందరి మాట. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ తర్వాత నాగబాబు ఆర్ధకంగా చాలా నష్టపోయారు. ఆ తర్వాత నుంచే సినిమాల నిర్మాణానికి ఆయన దూరమయ్యారు. టీవీ సీరియల్స్, పలు షోస్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే నాగబాబు
చిరంజీవి నటించిన చాలా సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి మెప్పించారు.

Nagababu: ఈ సినిమా మళ్ళీ నాగబాబును ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

అయినా తమ్ముడితో నిర్మాణ సంస్థను ప్రారంభిస్తే బావుంటుందని చిరంజీవి డిసైడయ్యి తమ తల్లి పేరైన అంజన పేరుపై అంజన ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నాగబాబు నిర్మాతగా సినిమాలు మొదలు పెట్టారు. ఈ సంస్థలో వచ్చిన మొదటి సినిమా రుద్రవీణ. ఈ సినిమాకి జాతీయ అవార్డ్ దక్కింది. ఇంకా పలు అవార్డులు దక్కించుకుంది. కానీ కమర్షియల్‌గా మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత త్రినేత్రుడు సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాగానే ఆడింది. అయితే దీని తర్వాత వచ్చిన ముగ్గురు మొనగాళ్ళు సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. దాంతో మళ్ళీ కొంత ఆర్ధికంగా నష్టాలు వచ్చాయి.

దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగబాబు మళ్ళీ అన్నయ్యతోనే బావగారు బాగున్నారా సినిమాను నిర్మించారు. వాస్తవంగా ఈ సినిమా కథ తయారైంది నాగబాబు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం. కానీ ఎందుకనో పవన్ కళ్యాణ్ ఈ కథ మీద అంతగా ఆసక్తి చూపించకపోవడంతో దర్శకుడు జయంత్ సి పరాన్‌జి కథలో కొన్ని మార్పు చేసి మెగాస్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా తెరకెక్కించి హిట్ కొట్టాడు. దీంతో నాగబాబు ఆయనే హీరోగా కౌరవుడు అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా మళ్ళీ నాగబాబును ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ సినిమా తీస్తే ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

Nagababu: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఒప్పుకుంది కూడా నాగబాబును అప్పుల్లో నుంచి బయటపడేయడానికే..!

ఆ తర్వాత శ్రీకాంత్ – స్నేహలతో రాధాగోపాలం, మెగాస్టార్‌తో స్టాలిన్, రాం చరణ్‌తో ఆరెంజ్ సినిమాలు నిర్మించి బాగా నష్ఠపోయారు. ముఖ్యంగా చరణ్‌తో తీసిన ఆరెంజ్ సినిమా నాగబాబును అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఆ సమయంలో ఆయన సీతా మహాలక్ష్మి సీరియల్‌లో నటిస్తూ చాలా బిజీగా ఉండి నమ్మకంగా నిర్మాణ బాధ్యతలు వేరే వాళ్ళమీద వదిలేశారు. వారు నాగబాబును దారుణంగా మోసం చెసి నష్ఠాల్లోకి నెట్టేశారు. ఆ సమయంలో ఆయన మానసికంగా చాలా కృంగిపోయారు. అప్పుడు ఒకవైపు అన్నయ్య,
మరొకవైపు తమ్ముడు అండగా నిలబడి నాగబాబును సేవ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా ఒప్పుకుంది కూడా నాగబాబును అప్పుల్లో నుంచి బయటపడేయడానికే అని ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలిపారు.


Share

Related posts

YCP MLA RK Roja: జల వివాదంలో తెలంగాణ వాళ్లు ఇష్టానుసారంగా చేస్తే సీఎం జగన్ సహించరంటూ రోజా హెచ్చరిక

somaraju sharma

ఇక్కడ హిట్ కొట్టిన సినిమా అక్కడ బోల్తా పడుతుందని ఎలా అంటారు ..?

GRK

తిరుమల వెళ్తున్నారా..!? ఈ బస్సు కచ్చితంగా ఎక్కాల్సిందే..! టీటీడీలో కొత్త బస్సులు

bharani jella