న్యూస్ సినిమా

Nagachaitanya : నాగ చైతన్య మరో క్రేజీ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Share

Nagachaitanya : అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేశాడు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించబోతున్నారు. చాలా కాలం తర్వాత చైతు మంచి లవ్ స్టోరిలో నటించాడని అంటున్నారు. ఇక మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీలో ఒకడిగా కలిసిపోయిన దర్శకుడు
విక్రమ్ కుమార్. ఆయన దర్శకత్వంలో చైతూ ఒక సినిమాను కంప్లీట్ చేశాడు.

is nagachaitanya gave green signal to another crazy director....?
is nagachaitanya gave green signal to another crazy director….?

ఈ సినిమాను థ్యాంక్యూ టైటిల్ తో తెరకెక్కించగా రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా చైతూ లైనప్ చేసుకుంటున్నాడు. వీటిల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించబోయేది కూడా ఉన్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. పెళ్ళి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో బాగా పేరు
తెచ్చుకున్నాడు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ తోనూ మంచి రాపో మేయింటైన్ చేస్తున్నాడు.

Nagachaitanya : నాగచైతన్యతో తరుణ్ భాస్కర్ సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ అప్‌డేట్.

వాస్తవంగా అయితే ఈ దర్శకుడితో వెంకటేష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ కూడా ఇంతక ముందు కొన్నిసార్లు సురేష్ బాబుకు – వెంకటేష్ లకు కథను వినిపించానని చెప్పుకొచ్చాడు. కథ వారిద్దరికీ బాగా నచ్చడంతో వెంకటేష్ ఈయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పుకున్నారు. కానీ కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యతో తరుణ్ భాస్కర్ సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ అప్‌డేట్.


Share

Related posts

శ్ర‌ద్ధాక‌పూర్ పెళ్లి..?

Siva Prasad

Turmeric Coffee: ఈ హెర్బల్ కాఫీతో డయాబెటిస్, క్యాన్సర్ కు చెక్..!!

bharani jella

పెళ్లి మండపంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్… బాబాయ్ ని చూడగానే నిహారిక కళ్ళల్లో నీళ్లు!!

Naina