2013 లో “మనస్సినక్కరే” సినిమాతో మళయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నయనతార మొదటి సినిమాతోనే మంచి నటి అనిపించుకుంది. అంతేకాదు ఈ సినిమా వలనే నయనతార సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళం, మళయాళం లో వరసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. అంతేకాదు సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అన్న ఇమేజ్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన నయనతార చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి అయినప్పటికి ఏదో ఒక కాంట్రవర్సీలల్లో నిలుస్తూనే ఉంటుంది.
ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయనతార డీప్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమాయణం చాలా ఏళ్లుగా సాగుతుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేరళలోని ఓ గుడిలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నారట. వాస్తవంగా గత ఏడాదే నయనతార పెళ్లి చేసుకోబోతుందని రూమర్లు వచ్చాయి. కాని నయనతార నా పెళ్ళి కి ఇంకా సమయం ఉనదంటూ క్లారిటి ఇచ్చింది.
అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని పలువురు పెళ్ళి చేసుకొని దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో నయనతార కూడా విఘ్నేష్ శివన్ పెళ్లికి రెడీ అయిందని సమాచారం. మరి ఈసారి వస్తున్నవి కూడా రూమర్సా లేక నిజమా అన్నది నయనతార వెల్లడించేంత వరకు నమ్మడానికి లేదు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది సినీ తారలు పెళ్ళి చేసుకుంటున్నారన్న ఫేక్ న్యూస్ క్రియోట్ చేస్తుండగా అవి బాగా వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం నయన తార సూపర్ స్టార్ రజనీకాంత్ తో అన్నాత్తే అన్న సినిమాలో నటిస్తుంది. అన్నయ్య పేరుతో తెలుగులోను ఈ సినిమా రిలీజ్ కానుండగా మరో మూడు తమిళ సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.