Niharika: మెగా ఫ్యామిలీలో దాదాపు 10 మంది హీరోలురు. మెగాస్టార్ చిరంజీవి, నాగ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇంత మంది హీరోల మధ్య మెగా డాటర్ నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది. మెగా డాటర్ అని మాత్రమే కాకుండా తనలో ఆ జీన్స్ ఉండటంతో యాక్టింగ్ పరంగా అందరి ప్రశంసలు అందుకుంది. కేవలం సినిమాలలోనే కాదు బుల్లితెరపై కూడా నిహారికకు మంచి క్రేజ్ ఉంది.
ఇంత క్రేజ్ ఉన్న నిహారిక వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. నిహారిక హీరోయిన్గా చేస్తానని ఒక్క మాట చెప్పాలే గానీ టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్ అందరూ కథలు సిద్దం చేసి ముందుపెడతారు. ఒక్క తెలుగులోనే కాదు ఆమె కావాలనుకుంటే తమిళ సినిమాలలోనూ నటించే అవకాశాలను దక్కించుకుంటారు. కానీ ఇలా వచ్చి అలా హీరోయిన్గా సినిమాలకు చెప్పకనే గుడ్‌బై చెప్పేసింది. ఇది మెగా అభిమానులకు తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. చాలామందికి నిహారిక సినిమాలు మానేసిందని భావించడం లేదు.
Niharika: దానికి కొంచం సమయం పడుతుందని తాజాగా నిహారిక చెప్పుకొచ్చింది.
కానీ ఆమె ఇకపై హీరోయిన్గా కొనసాగనని స్వయంగా వెల్లడించింది. అందుకు కారణం ఆమె భర్త అని కూడా చెప్పుకొచ్చింది నిహారిక. పెళ్లైయ్యాక నిహారిక హీరోయిన్గా చేయడం ఆమె భర్త చైతన్యకు ఇష్టం లేదట. అందుకే తాను సినిమాలకు గుడ్‌బై చెప్పినట్టు వెల్లడించింది. అయితే సినిమా రంగంలోనే కొనసాగాలని అభిలాషతోనే నిర్మాతగా మారినట్టు తెలిపిన నిహారిక ఓ వెబ్ సిరీస్‌లో మాత్రం నటించబోతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా తన నిర్మాణంలో సినిమా ఉండబోతోందని దానికి కొంచం సమయం పడుతుందని తాజాగా నిహారిక చెప్పుకొచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?