Nithin : టాలీవుడ్ లో యూత్ స్టార్ గా నితిన్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వచ్చాడు. అవే చెక్, రంగ్ దే. చెక్ నిరాశ పరచగా, రంగ్ దే యావరేజ్ హిట్ సాధించింది. ఈ క్రమంలో తాజాగా యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో ‘మాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో డీసెంట్ హిట్ అందుకున్న ‘అంధాదున్’ సినిమాకి అఫిషియల్ రీమేక్ గా తెలుగులో మాస్ట్రో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ రీసెంట్ గా మొదలు పెట్టారు.
ఈ సినిమా తర్వాత ఇంతక ముందు నితిన్ తో ఛల్ మోహన రంగ సినిమా చేసిన కృష్ణ చైతన్యతో పవర్ పేట చేయనున్నాడట. ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో పాటుగా వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా నితిన్ తాజాగా మరో కొత్త దర్శకుడికి ఓకే చేప్పాడని సమాచారం.. ఆ డైరెక్టర్ కి మొదటి సినిమా. అంటే నితిన్ ఆయనని ఇండస్ట్రీకి దర్శకుడిగా ఇంట్ర్డ్యూస్ చేయనున్నాడని తెలుస్తోంది. ఆయన ప్రముఖ ఎడిటర్ అనే టాక్ వినిపిస్తోంది.
Nithin : ఆయన జడ్జ్ మెంట్ మీదే సినిమాలలో మార్పు చేస్తుంటారు.
ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఎడిటర్ గా పనిచేసీ ఎస్ ఆర్ శేఖర్ కి నితిన్ దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం. ఇంతకముందు నితిన్ హీరోగా నటించిన ‘లై’, ‘చల్ మోహన్ రంగ’. ‘హార్ట్ ఎటాక్’ ప్రస్తుతం నటిస్తున్న మాస్ట్రో సినిమాలకు ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎడిటర్ గా మంచి పేరుంది. సినిమా ను జడ్జ్ చేయడంలో దర్శకులకు సలహాలివ్వడంతో ఏమాత్రం ఆలోచించడు. దర్శక, నిర్మాతలు, హీరోలు ఆయన జడ్జ్ మెంట్ మీదే సినిమాలలో మార్పు చేస్తుంటారు. అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తిని నితిన్ ఇండస్ట్రీకి తీసుకు రాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది.