Nivetha Pethuraj: నివేతా పేతురాజ్ కమర్షియల్ హీరోయిన్‌గా కష్టమేనా..? ఎన్ని సినిమాలు చేసినా అక్కడే ఉంటోంది పాపం.

Share

Nivetha Pethuraj: సినిమా ఇండస్ట్రీలో లక్ ఫేవర్ చేసి అవకాశాలు వస్తున్న కొందరి పరిస్థితి నత్త నడకన సాగుతుంటుంది. స్టార్ హీరోయిన్‌గా నిలబడాలని ఎంత తాపత్రయపడి సినిమాలు చేసినా, ఒక మార్క్ దగ్గరే ఆగిపోయి అడుగు ముందుకు పడదు. దాంతో స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవడంలో విఫలమతారు. వీరి పరిస్థితి అటు చిన్న సినిమాలను ఒప్పుకోలేక అటు పెద్ద నిర్మాణ సంస్థలలో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కక కెరీర్ మధ్యలో ఊగిసలాడుతూ ఉంటుంది.

is nivetha-pethuraj-can become a commercial heroine
is nivetha-pethuraj-can become a commercial heroine

అలా ప్రస్తుతం కెరీర్ డైలమాలో కొనసాగుతున్న హీరోయిన్ నివేతా పేతురాజ్. చూడటానికి మంచి ఫిజిక్, అందం, అభినయం ఉన్నా కూడా నివేతా పేతురాజ్‌కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే సినిమా ఏదీ పడటం లేదు. పేరుకు అల వైకుంఠపురములో లాంటి పెద్ద సినిమాలో నటించినా అసలు అందులో నివేతా పేతురాజ్ ఉందా..ఎక్కడ కనిపిస్తుంది..అనే సందేహాలు కలుగుతాయి. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్‌కి హీరో అల్లు అర్జున్‌కి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్‌కి దక్కింది. మిగిలిన కాస్తో కూస్తో క్రెడిట్ ఉంటే అది పూజా గెగ్డేకి వెళ్ళిపోయింది.

Nivetha Pethuraj: రెడ్ సినిమా చేసినా నివేతాకి కలిసి వచ్చిందేమీ లేదు.

ఈ సినిమా తర్వాత నివేతా పేతురాజ్‌ నటించిన మాస్ ఎంటర్‌టైన్మెంట్ రెడ్. ఇందులో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించాడు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించింది. అమృత అయ్యర్ మరో హీరోయిన్‌గా నటించింది. అయితే ఇందులో హీరోయిన్స్ ముగ్గురిదీ అంత గొప్ప పాత్రలు కాదు. చెప్పాలంటే నివేతా పేతురాజ్ పోషించిన పోలీస్ పాత్ర తెరమీద ఎక్కువ సేపు కనిపిస్తుంది. కానీ హీరోతో ఆమెకి డ్యూయెట్ గాని, సోలో సాంగ్ గానీ ఉండవు. అంతేకాదు సినిమా మొత్తం పోలీస్ యూనిఫారంలోనే కనిపిస్తుంది. ఎక్కడా గ్లామర్‌గా కనిపించదు.

దాంతో రెడ్ సినిమా చేసినా నివేతాకి కలిసి వచ్చిందేమీ లేదు. పైగా సినిమా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేపోయింది. అంతక ముందు చేసిన బ్రోచేవారెవరురా సినిమా కూడా హిట్ అయిన క్రెడిట్ మొత్తం హీరో శ్రీవిష్ణు, నివేతా థామస్‌లకే విళ్ళిపోయింది. ఇందులో చేసిన పాత్ర కూడా ఆమె కెరీర్‌కి పెద్దగా  ఉపయోగపడింది లేదు. ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్‌తో పాగల్ అనే సినిమా చేసింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్‌తో నడిచింది. ఈ సినిమా విషయంలో కూడా నివేతా పేతురాజ్ పేరు గట్టిగా వినిపించింది లేదు.

Nivetha Pethuraj: నివేతా విషయానికొస్తే ఆమె కమిటయిన పాత్ర కోసం బాగానే శ్రమిస్తుందని టాక్ ఉంది.

దాంతో ఆమె కెరీర్ ఏంటో ఇలా సాగుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొందరు టాలెంటెడ్ హీరోయిన్స్ పరిస్థితి ఎందుకు ఇలా మారుతుందో ఎవరికీ అర్థం కానిది. నివేతా విషయానికొస్తే ఆమె కమిటయిన పాత్ర కోసం బాగానే శ్రమిస్తుందని టాక్ ఉంది. ఎంత శ్రమించినా కూడా రష్మిక మందన్న, పూజా హెగ్డే, సాయి పల్లవి, కీర్తి సురేశ్ లాంటి స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లోనైనా నివేతా పేతురాజ్‌కి మంచి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కి స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీని దక్కించుకుంటుందేమో.


Share

Related posts

Pawan Kalyan : “వకీల్ సాబ్” మాదిరిగానే పవన్ – రానా మూవీ..!!

sekhar

మార్చి 1న ఏబిసిడీ గ్రాండ్ రిలీజ్…

Siva Prasad

Poll : ఆంధ్ర ప్రదేశ్ నూతన బడ్జెట్ 2,24,789 కోట్ల పై మీ అభిప్రాయం ?

ramu T