NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరన్, ఓలివియా మోరీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది.
కాగా మార్చ్ వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ కాబోతుండగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధకృష్ణ – నందమూరి కళ్యాణ్ రాం సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 30 గా రూపొందబోతోంది. కాగా ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందనుంది. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కాగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాబోతోంది.
NTR : ఎన్టీఆర్ ..కొరటాల శివ తో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్..?
కాగా ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ బ్యానర్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ కంప్లీట్ కాగానే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ – మైత్రీ వారి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత కూడా భారీ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడని సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఉండబోతుందట.