వకీల్ సాబ్ సర్ప్రైజెస్ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ సినిమా పింక్ రీమేక్ అన్న సంగతి తెలిసందే. ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ నటించాడు. అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ రెండు భాషల కంటే తెలుగులో భారీ సక్సస్ అయ్యేలా వకీల్ సాబ్ ని నిరిస్తున్నారు. ఇక పవర్ స్టార్ ఇమేజ్ కూడా ఈ సినిమా కి తోడవడంతో అటు ఫ్యాన్స్ లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ మొదలవబోతున్నాయని సామాచారం. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో వకీల్ సాబ్ మీద భారీగా అంచనాలున్నాయి. పవర్ స్టార్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ ఒరిజినల్ పింక్ కథ లో కొన్ని కీలక మార్పులు చేసి కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది.
ఈక్రమంలో త్వరలో టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి దిల్ రాజు ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అది విజయదశమి అండుగ రోజే అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే టీజర్ కట్ చేయడం కూడా అయిందని తెలుస్తుంది. థమన్ ఈ టీజర్ కి మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. శృతిహాసన్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనుండగా త్వరలో షూటింగ్ లో జాయిన్ కానుందని సమాచారం.