Payal rajputh : ‘ఆర్ఎక్స్100’ వంటి సెన్షేషనల్ క్రియేట్ చేసిన సినిమాతో అడుగు పెట్టింది ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజపుత్. డెబ్యూ సినిమాలో ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ బోల్డ్ క్యారెక్టర్ లో నటించి విపరీతమైన క్రేజ్ దక్కించుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాతో భారీ హిట్ రావడంతో పాటు అవార్డు కూడా తెచ్చిపెట్టడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అవుతుందని, వరుసగా అవకాశాలు అందుకుంటుందని అందరూ భావించారు. కానీ అందరూ అనుకున్నట్టు జరగలేదు. క్రేజ్ వచ్చినా పాయల్ కు ఆశించిన అవకాశాలు రాలేదు. ‘ఆర్ఎక్స్100’ చేసిన వెంటనే ‘ఆర్డిఎక్స్ లవ్’ అనే మరో బోల్డ్ సినిమాలో అవకాశం అందుకుంది.
ఈ సినిమాతో మరోసారి పాయల్ యూత్ అందరికి చమటలు పట్టించింది. అయితే రెండవ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘సీత’లో ఐటెం సాంగ్ లో మెరిసింది. 2019లో నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ‘వెంకిమామ’ సినిమాలో వెంకీకి జంటగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా, ఆ హిట్ పాయల్ కు ఉపయోగపడలేదు. ఆ తర్వాత రవితేజ తో చేసిన డిస్కో రాజా భారీ డిజాస్టర్. దాంతో పాయల్ కెరీర్ డైలమాలో పడింది. కాగా లాక్ డౌన్ కారణంగా ఓటిటిలకి ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అయ్యారు.
Payal rajputh : తమిళంలో ఏంజెల్ అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
దాంతో స్టార్ హీరోయిన్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాయల్ కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఓటిటి కోసం ఒక సినిమా చేస్తోంది. ఇటీవల వచ్చిన అనగనగా ఓ అతిథి లో నటించి ఆకట్టుకుంది. కాగా పంజాబీ భాషలో పాయల్ గతంలో సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగు సినిమా అవకాశాలు లేకపోవడంతో మళ్ళీ ఇండస్ట్రీ మారబోతోందట. పంజాబీ భాషలో అవకాశాలు వస్తుండటంతో అక్కడ సినిమాలకు సైన్ చేసిందని తాజా సమాచారం. ఇక తమిళంలో ఏంజెల్ అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.