రీసెంట్ గా ప్రభాస్ తను నటిస్తున్న 20 వ సినిమాకి రాధే శ్యామ్ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసి టైటిల్ తో పాటు ప్రభాస్ పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాని గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్ లో రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పుస్తుండగా యువి క్రియోషన్స్ లో వంశీ ప్రమోద్ తో పాటు ప్రభాస్ సిస్టర్..కృష్ణం రాజు కూతురి ప్రశీద కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తుంది. చెప్పాలంటే ప్రభాస్ చెల్లెలు మొదటిసారి నిర్మాతగా ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది.
ఇక రీసెంట్ గా రిలీజైన పోస్టర్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. కంప్లిట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్ళు బాహుబలి, సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు లవ్ స్టోరీ తో రాబోతుండటం తో బాగా చేంజ్ కనిపిస్తుంది. అయితే కొంతమంది యాక్షన్ సీన్స్ కూడా ఉంటే బావుంటుందన్న భావనని వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా కటౌట్ కి తగ్గట్టు యాక్షన్ సీన్స్ ఉంటాయని కొంతమంది అంటున్నారు. ఒక్క ఫస్ట్ లుక్ తోనే అన్ని డిసైడ్ చేసేయలేము కదా..టీజర్ గాని ట్రైలర్ గాని వచ్చే వరకు ఆగితే అన్ని తెలుస్తాయి కదా అని అంటున్నారట.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా నటిస్తున్న పూజా హెగ్డే కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ లో కనిపించబోతుందని అంటున్నారు. క్లాసీగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా మ్యూజిక్ టీచర్ గా నటిస్తుందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే తన కాస్ట్యూంస్ ఉంటాయట. అంతేకాదు ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో చిట్టి పొట్టి డ్రసుల్లో కనిపించిన పూజా రాధే శ్యామ్ లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపించబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లోను కనిపించబోతుంది.