న్యూస్ సినిమా

పూజా హెగ్డే కి టాలీవుడ్, బాలీవుడ్ కంటే కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ ..?

Share

పూజా హెగ్డే ప్రస్తుతం వరస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజి బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు కంప్లీట్ చేసిన పూజా హెగ్డే బాలీవుడ్ లో వరసగా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ లతో పూజా హెగ్డే నటిస్తుండగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. రాధే శ్యాం షూటింగ్ లో నెలరోజులుగా పాల్గొన్న పూజా హెగ్డే రీసెంట్ ఈ సినిమా కి గుడ్ బాయ్ చెప్పి ముంబై వెళ్ళింది. అక్కడ రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.

కాగా పూజా హెగ్డే కి ఇప్పుడు టాలీవుడ్.. బాలీవుడ్ కంటే క్రేజీ ఆఫర్ కోలీవుడ్ నుంచి వచ్చిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవంగా అయితే పూజా హెగ్దే ఎప్పుడో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాల్సింది. కానీ తెలుగు సినిమాలతో డేట్స్ సర్ధుబాటు చేయలేక వచ్చిన అవకాశాలను వదిలేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో ఇంకా ఏ కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఈ క్రమంలో కోలీవుడ్ సినిమాకి సైన్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో నటించే అవకాశం పూజ హెగ్డే కు వచ్చిందని సమాచారం. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తమిళంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డేట్స్ విషయంలో పూజా హెగ్డే తో చర్చలు జరుపుతున్నారట దర్శక, నిర్మాతలు. పూజా డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడమే తరువాయి అంటున్నారు. ఇక విజయ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సంక్రాంతి సందర్భంగా రిలీజై సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది.


Share

Related posts

Acharya : ఆచార్య సినిమాలో ఆ ఒక్క సాంగ్ చాలు మెగా ఫ్యాన్స్ ఏళ్ళతరబడి చెప్పుకుంటారు..!

GRK

Allu Shirish : ఆటో డ్రైవర్ గా మెగా హీరో..??

sekhar

బ్రేకింగ్ : ” మీరే కోర్టుకి రావాల్సి ఉంటుంది .. కోర్టు ధిక్కరణగా చూస్తాం ” తెలంగాణ హై కోర్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్

siddhu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar