ప్రభాస్ – త్రిష – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది సంజన గల్రాని. కన్నడ లో ఎక్కువ సినిమాలు చేసిన ఈ బ్యూటి తెలుగులో మాత్రం ఎక్కువగా సెకండ్ లీడ్ క్యారెక్టర్సే చేసింది. మొత్తానికి తెలుగు కన్నడ, తమిళం, మలయాళం సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి పేతు తెచ్చుకుంది గాని స్టార్ హీరోయిన్ గా మాత్రం క్రేజ్ దక్కలేదు.
ఇక రీసెంట్ గా కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం బయటపడడం సంచనం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ ప్రముఖలు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నట్టు ఒక్కొక్క పేరు బయటకు వస్తోంది. అయితే ప్రముఖంగా తెలుగు తో పాటు కన్నడ సినిమాలు చేస్తున్న హీరోయిన్ సంజనా పేరు ఇప్పుడు ఈ డ్రగ్స్ దందాలో వినపడుతోంది. ఈ వార్తలతో సంజన మానసికంగా కృంగిపోతుందట.
సంజన గల్రాని తెలుగు కన్నడ చిత్ర పరిశ్రమలో పలుచిత్రాల్లో నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందిన సంగతి అందరికి తెలిసిందే. సజ్ఞా కి తెలుగు కంటే కూడా కన్నడ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే తాజాగా ఆమె పేరు బయటపడడంతో అందరి దృష్టిలో సంజన పేరు మారుమోగుతోంది.
సంజన స్నేహితులలో బాగా సన్నిహితంగా ఉండే రాహుల్ ని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దాంతో మీడియా ఆమె పేరును కూడా హైలైట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఆమెను కూడా ప్రశ్నించడానికి పిలుస్తారని.. ఈ వ్యవహారం లో తన పాత్ర ఉందని ప్రూవ్ అయితే అరెస్టు చేయవచ్చని కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోందట.
అయితే ఈ వ్యవహారం లో తన పాత్ర లేనే లేదని .. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని సంజన చెబుతోందట. తన పేరును ఈ డ్రగ్స్ దందాలో అనవసరంగా తీసుకురావద్దని కన్నడ మీడియాకు కోరుతుందట. కొన్ని సందర్భాలలో ఏ తప్పు చేయకపోయినప్పటికి పరిచయాల వల్ల కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు సంజనా విషయంలో జరుగుతుందని అంటుందట.