Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ తాజాగా గురు పౌర్ణమి సందర్భంగా ప్రారంభమయిన విషయం తెలిసిందే. ప్రభాస్ క్లాప్ కొట్టగా అమితాబ్ బచ్చన్ మీద షూటింగ్ మొదలు పెట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 వసంతాల సందర్భంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ కి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయన మీదే మొదటి షెడ్యూల్ ప్రారంభించిన చిత్ర యూనిట్ వారం రోజులు జరపనున్నారు.
ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ ప్రేక్షకులలో భారీ క్యూరియాసిటీని పెంచారు. ప్రాజెక్ట్ కె అంటే కె అనే అక్షరంతో సినిమా టైటిల్ పెడతారనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే కె అనే అక్షరంతో వచ్చే ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ని ఆలోచిస్తూ ఈ సినిమాకి మేకర్స్ అనుకుంటున్న టైటిల్ ఏంటని తెగ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. అయితే దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అని పూర్తి పేరు ప్రకటించినా కూడా అందరూ పిలిస్తుంది మాత్రం ఆర్ ఆర్ ఆర్ అనే.
Prabhas : ‘K’ అనే అక్షరంతో టైటిల్ ప్రకటించనున్నారా
అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ కె కూడా ఫైనల్ టైటిల్ అదే అవుతుందని టాక్ వినిపిస్తోంది. కె అనే అక్షరంతో టైటిల్ ప్రకటించనున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ లేనప్పటికి ప్రాజెక్ట్ కె అనేదే చిత్ర బృందం రానున్న రోజుల్లో అధికారకంగా ప్రకటించనున్నట్టు చెపుకుంటున్నారు. కాగా ఈ చిత్రానికి లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రభాస్ చేస్తున్న సలార్ షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ కె షూటింగ్ లో జాయిన్ కానున్నాడట. ఒకవైపు రాధే శ్యాం, ఆదిపురుష్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు మన పాన్ ఇండియన్ స్టార్.