Pragya Jaiswal: నట సింహం నందమూరి బాలకృష్ణ – మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ అని మరోసారి ప్రూవ్ చేశారు బాలయ్య – బోయపాటి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాయి. అప్పుడు బాలయ్యకు మంచి కావాల్సిన సమయంలో బోయపాటి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అంతే. బాలయ్య 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ సక్సెస్ తర్వాత మళ్ళీ బాలయ్యకు ఇప్పటి వరకు భారీ హిట్ దక్కలేదు. మళ్ళీ ఇప్పుడు అఖండతో ఊహించని సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా మొదలైనప్పటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చాయి. ముందు నుంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన అఖండ అందుకు ఏమాత్రం తగ్గకుండా డే వన్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న అఖండ ఇంతపెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇక బాలయ్య అందుకున్న ఈ భారీ సక్సెస్‌తో సూపర్ ఫాంలోకి వచ్చారు. బాలయ్య మాత్రమే కాదు వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బోయపాటి ఎట్టకేలకి మాస్ హిట్ అందుకున్నాడు. థమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.
Pragya Jaiswal: ఈ సినిమా సక్సెస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు దక్కిందేంటి..?
అయితే, ఈ సినిమా సక్సెస్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు దక్కిందేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సింహ సినిమాలో నయనతార పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత లెజెండ్ సినిమాలోనూ రాధిక ఆప్టేకు బాగానే పేరొచ్చింది. మరి ఇప్పుడు అఖండ సినిమా ఇంతపెద్ద అఖండ విజయం సాధించిన కూడా ఆ క్రెడిట్ ప్రగ్యాకు అంతగా ఉపయోగపడలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు తప్పని ప్రూవ్ అవ్వాలంటే ప్రగ్యాకు వరుసగా రెండు సినిమాలలో అవకాశాలు దక్కాల్సిందే.