నారప్ప .. విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచి 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అసురన్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెలుగులో సురేష్ బాబు .. కలైపులి ఎస్ థాను కలిసి నిర్మించారు. కోలీవుడ్ లో ధనుష్ నటించిన ఊర మాస్ క్యారెక్టర్ ని తెలుగులో వెంకటేష్ పోషించాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వెంకటేష్ నారప్ప తో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ నారప్ప పాత్ర .. ప్రియమణి పాత్ర ఎంత హైలెట్ అవుతుందో లాయర్ వేణుగోపాల్ గా నటించిన ప్రకాష్ రాజ్ పాత్ర అంత హైలెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. కొన్ని సీన్స్ లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో చప్పట్లు .. విజిల్స్ పడతాయని చిత్ర బృందం అంటున్నారు. ముందు నుంచి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు.
మేకోవర్ చేసి గెటప్ తో సీన్ లోకి ఎంటరైతే ఇక ప్రకాష్ ఎంతగా రెచ్చిపోతాడో ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలలో చూశాము. కాగా నారప్పలో ప్రకాష్ రాజ్ పోషించిన వేణుగోపాల్ పాత్ర మరో గొప్ప పాత్రగా నిలుస్తుందని సమాచారం. ఇక ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో అడ్వకేట్ సూర్యప్రకాశ్.. ‘అల్లుడు అదుర్స్’, ‘పుష్ప’ సినిమాలలోని పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ఒకవైపు సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూనే మరొకవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేస్తున్నారు.