Pushpa: బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్పింది. ఈ సినిమా కోసం దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నాలుగేళ్లు ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో రాజమౌళి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే బాహుబలి ది బిగినింగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ చూశారో అవన్నీ ప్రశంసలుగా మారాయి. ఇక మొదటి భాగాన్ని ఎంత పక్కా స్క్రిప్ట్‌తో తెరకెక్కించారో క్లైమాక్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేసి రెండవ భాగం మీద భారీ అంచనాలు క్రియేట్ చేశారు.
బాహుబలిని వెన్నుపోటి పొడిచి చంపిందెవరు అనేదాన్ని క్లైమాక్స్‌లో ఫ్రీజ్ చేసి కన్‌క్లూజన్‌లో రివీల్ చేశారు. ఈ వెన్నుపోటు పాయింట్ రెండు భాగాలకి కేంద్ర బిందువుగా మారింది. బాహుబలి రెండు భాగాలు భారీ సక్సెస్ కావడంతో పాటు వందలకోట్ల వసూళ్లు రాబట్టి హాలీవుడ్ సినిమా స్థాయికి మించి తెలుగు సినిమా ఉంటుందని రాజమౌళి చాటి చెప్పారు. ఇప్పుడు పుష్ప సినిమాకి కూడా ఇదే కథా గమనాన్ని సుకుమార్ అనుసరిస్తున్నాడట. అయితే రాజమౌళి వీఎఫెక్స్ మీద బాగా ఆధారపడ్డారు. కానీ సుకుమార్ మాత్రం సహజంగా చూపించబోతున్నాడు.
Pushpa: పుష్పరాజ్ ఎదిగిన తర్వాతి కథ మొత్తం ‘పుష్ప 2’ లో
ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో కూడా బాహుబలి కథా గమనాన్ని అనుసరించే సుకుమార్ తెరకెక్కిస్తున్నాడట. పుష్పరాజ్ అల్లు అర్జున్ ఓ పెద్ద శక్తిగా ఎదగడానికి విలన్ గ్యాంగ్ లోనే ఒకతను ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. విలన్ తో ఉంటూనే హీరోకి సహాయపడేలా ఉంటుందట. ఆ పాత్ర ను క్లైమాక్స్ లో ప్రస్తావించి.. సెకండ్ పార్ట్ లో అది ఎవరు అనేది రివీల్ చేస్తారట. ఇక డాన్ గా పుష్పరాజ్ ఎదిగిన తర్వాతి కథ మొత్తం ‘పుష్ప 2’ లో చూపించబోతున్నాడట సుకుమార్.