పుష్ప సినిమాని సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేయనున్నారా ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ నిర్మిస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమాగా 5 భాషల్లో రిలీజ్ కానుండగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

Allu Arjun Pushpa setting with Mahabubnagar - tollywood

ఇక ఈ సినిమాని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించబోతుండగా ఎక్కువ భాగం కేరళ లోని దట్టమైన అడవుల్లో షూటింగ్ జరిపేందుకు సుకుమార్ పక్కా ప్రణాళిక తో సిద్దమవుతున్నాడట. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి సజావుగా చిత్రీకరణ జరగలేదన్న సంగతి తెలిసిందే.

అంతేకాదు ఇంకో రెండు నెలలు అయితే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో వచ్చి సంవత్సరం పూర్తవుతుంది. వాస్తవంగా ఈ సినిమా సంక్రాంతి కి రెడీ చేయాలన్న ప్లాన్ తోనే మేకర్స్ సినిమాని మొదలు పెట్టారు. కాని కరీనా లాక్ డౌన్ తో చూస్తూ చూస్తూ 7 నెలలు దాటింది.

అందుకే త్వరలో పుష్ప సినిమా షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా టాకీపార్ట్ కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు షూటింగ్ తో పాటు ఎడిటింగ్, డబ్బింగ్ వర్క్ ని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దాదాపు సినిమాని గ్యాప్ రాకుండా సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.