NewsOrbit
న్యూస్ సినిమా

Raai Laxmi: లక్ష్మీ రాయ్ స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశపడితే ఐటెం గర్ల్‌ను చేసేశారు.

Raai Laxmi: లక్ష్మీ రాయ్ గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ల కోసం రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్నారు. అయినా ఆమె ఆశించిన అవకాశాలు అంతగా దక్కడం లేదు. ఇండస్ట్రీకొచ్చే అందరూ అమ్మాయిలు స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సాధించుకోవాలనే వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక వారి డెస్టినీ ఎటు తీసుకుకెళుతుందో ఏ పాత్రలకి పరిమితం చేస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రేక్షకులు వారిని ఎలా చూడాలనుకుంటే అలా క్రేజ్ సంపాదించుకునేవారు ఉన్నారు. ఇక కొంతమంది హీరోయిన్‌గా మాత్రమే సినిమాలు చేస్తానని పట్టుపట్టిన వారు ఆ అవకాశాలు రాక కనుమరుగైయ్యారు.

is raai-laxmi a star heroine or item girl
is raai laxmi a star heroine or item girl

కానీ లక్ష్మీ రాయ్ మాత్రం ఎలాంటి అవకాశాలు ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా అందిపుచ్చుకుంటోంది. ఇంకా ఆమె సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తే చేయాలని ఆశపడుతోంది. మన తెలుగులో నందమూరి బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకి ఇప్పుడు అంత పర్‌ఫెక్ట్‌గా హీరయిన్స్ దొరకడం లేదు. అయినా మేకర్స్ ఏజ్‌లో బాగా చిన్నవాళ్ళైనా కూడా సౌత్‌లో బాగా క్రేజ్ ఉన్నవారినే బాలయ్య లాంటి వారి సరసన తీసుకుంటున్నారు. అందుకే గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న లక్ష్మీ రాయ్ లాంటి వారికి మాత్రం హీరోయిన్‌గా అవకాశాలు దక్కడం లేదు.

Raai Laxmi: రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్నాక హిందీలో జూలీ 2 సినిమాలో నటించింది.

చెప్పాలంటే ఆమెను హీరోయిన్‌గా కంటే ఐటెం సాంగ్స్‌కే ఎక్కువగా తీసుకుంటున్నారు. కాంచనమాల కేబుల్ టి.వి. అనే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఈ సినిమా యావరేజ్‌గా ఆడింది. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాకి పార్థసారధి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత నీకు నాకు, బాలయ్యతో అధినాయకుడు లాంటి సినిమాలు చేసింది లక్ష్మీ రాజ్. అయితే ఎందుకనో ఆమెకి తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. కానీ తెలుగు కంటే మిగతా సౌత్ భాషలైన తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఎక్కువ సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంది.

అంతేకాదు రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్నాక హిందీలో జూలీ 2 సినిమాలో నటించింది. అంతకముందు అకీరా సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ జూలీ 2 రాజ్ లక్ష్మీకి కాస్త గుర్తింపు తెచ్చి పెట్టింది అని చెప్పాలి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో రత్తాలు రత్తాలు పాటతో బాగా ఆకట్టుకుంది. అంతకముందు కూడా రవితేజ నటించిన బలుపు సినిమాలో ఆడిపాడింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో తోబ తోబా పాటలో అలరించింది. మిగతా భాషలలో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం రాయ్ లక్ష్మీ ఐటెం సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వేర్ ఈజ్ ద వెంకట్ లక్ష్మీ అనే సినిమా తర్వాత మళ్ళీ రాయ్ లక్ష్మీ తెలుగులో కనిపించలేదు.

Raai Laxmi: మిగతా భాషలలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది రాయ్ లక్ష్మీ.

అయితే హిందీతో పాటు మిగతా భాషలలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించిన ఆనంద భైరవి షూటింగ్ స్టేజ్‌లో ఉంది. అలాగే కన్నడలో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఝాన్సీ ఐపిఎస్, తమిళంలో గ్యాంగ్‌స్టర్ 21 సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ లేకపోయి ఉంటే ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. చూడాలి మరి 2022లో అయినా రాయ్ లక్ష్మీ నటించిన 3 సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా.

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu