Rakul preeth singh: గమ్యం తరహాలో కొండపొలం..క్రిష్ హిట్ ఇస్తే టాలీవుడ్‌లో రకుల్ లైఫ్ సెటిల్ అవుతుందా..?

Share

Rakul preeth singh: క్రిష్..జాగర్ల మూడి రాధాకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఓ గొప్ప పేరు సంపాదించుకున్నాడు. దర్శకుడిగా మొదటి సినిమాతో వచ్చే ఎవరైనా యూత్ రొమాంటిక్ లవ్ స్టోరీనో..మాంచి మాస్ ఎంటర్‌టైనర్‌తోనో..ఈ రెండు కలిసి ఉన్న భద్ర వంటి సినిమాతోనో ఎంట్రీ ఇస్తారు. అప్పుడే కాస్త అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగలిగేది. మొదటి సినిమా యావరేజ్ హిట్ సాధించినా కూడా అటు ప్రేక్షకుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాలలో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కుతుంది. లేదా క్రిష్ మాదిరిగా గమ్యం వంటి ఓ విభిన్నమైన సినిమాతో వస్తేనో మొదటి సినిమా తర్వాత మంచి క్రేజ్ ఏర్పడుతుంది.

is rakul-preeth-singh-life settled by krish kondapolam movie
is rakul-preeth-singh-life settled by krish kondapolam movie

గమ్యం సినిమా తర్వాత టాలీవుడ్‌లో క్రిష్‌కి వచ్చిన క్రేజ్ అదే. గమ్యం సినిమాలోనూ లవ్ స్టోరి ఉంది. కానీ దాన్ని చూపించిన విధానం చాలా స్పెషల్‌గా ఉంటుంది. ట్రావెలింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన గమ్యం సినిమాలో ముఖ్యంగా ఉన్న పాత్రలు మూడే. శర్వానంద్, అల్లరి నరేశ్, కమిలినీ ముఖర్జీ. వీరిలో కూడా ఎక్కువ సన్నివేశాలు..సినిమా కథ మొత్తం సాగేది కూడా అల్లరి నరేశ్, శర్వానంద్ మధ్యనే. గాలి శీను పాత్రలో అల్లరి నరేశ్ ఎంత అద్భుతంగా నటించాడో అందరికీ గుర్తుండే ఉంటుంది. గమ్యం సినిమా వచ్చిన టైం కూడా ప్రేక్షకులు రెగ్యులర్ సినిమాలు చూస్తూ విసిగిపోయిన టైం. మంచి రిఫ్రెష్‌మెంట్ దొరికినట్టయింది.

Rakul preeth singh: కొండపొలం సినిమా మీద నెగిటివ్ కామెంట్స్

ఇప్పుడు కూడా కొండపొలం సినిమాతో రాబోతున్నాడు క్రిష్. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇండస్ట్రీ మొత్తం షూటింగ్ చేయాలంటే భయపడుతున్నారు. అలాంటి సమయంలో క్రిష్ అన్నీ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఏకాధాటిగా 45రోజులు షూటింగ్ జరిపి టాకీ పార్ట్ పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో నటించాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా మొదలు పెట్టి కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిపారు. అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో దాదాపు కోటిన్నరకి పైగా ఖర్చు చేసి వేసిన సెట్ కూలిపోయింది.

ఆ తర్వాత కరోనా కారణంగా హరి హర వీరమల్లు షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. అందుకు కారణం ఇది పీరియాడికల్ సినిమా కాబట్టి వందలమంది షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకొని వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం పూర్తి చేసుకొని వస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే 45 రోజుల్లో కొండపొలం సినిమాను పూర్తి చేసుకొని వచ్చాడు. కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ మధ్య సినిమాకి సంబంధించిన అప్‌డేట్ రాకపోయేసరికి అందరూ సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. కానీ ప్రమోషన్స్ మొదలు పెట్టి టైటిల్ పోస్టర్ వదిలినప్పటి నుంచి సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి.

Rakul preeth singh: కొండపొలం గనక భారీ హిట్ సాధిస్తే ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ టాలీవుడ్‌లో మంచి రీ స్టార్ట్

గ్యారెంటీగా క్రిష్ నుంచి వచ్చిన గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె వంటి అంద్భుతమైన సినిమాల తరహాలో కొండపొలం సినిమా కూడా డీసెంట్ హిట్ సాధిస్తుందని అందరిలో చాలా నమ్మకం పెరిగింది. ఇప్పటికే రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌లో వైష్ణవ్ తేజ్, ఓబులమ్మగా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ బాగా ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి పాత్రలు సినిమాలో చాలా హైలెట్‌గా నిలవడం ఖాయమని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు బలంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా కొండపొలం గనక భారీ హిట్ సాధిస్తే ఖచ్చితంగా రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ టాలీవుడ్‌లో మంచి రీ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. చూడాలి మరి కొండపొలం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో.

 


Share

Related posts

త్వరలో ఆ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్న అనసూయ..??

sekhar

రైలులో ప్రయాణిస్తున్నారు? అయితే ఈ విషయం తెలుసుకోండి!

Teja

ఏపీ బీజేపీ లో ఫుల్ గా దున్నేయచ్చు అని రంగంలోకి దిగిన వీర్రాజు కి స్ట్రాంగ్ వార్నింగ్ పడింది ? 

sekhar