Ram charan : మెగా పవర్ స్టార్ రాం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసందే. ప్రస్తుతం చరణ్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకు రావాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా..దీని తర్వాత చరణ్ నెక్స్ట్ సినిమా కోసం సిద్దమవుతాడని సమాచారం. ఒకవైపు ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమొషన్స్ లో పాల్గొంటూనే శంకర్ సినిమా షూటింగ్ లో జాయిన్ కావడానికి ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ఇటీవలే ఫైనల్ అయ్యారు.
కాగా సెప్టెంబర్ నుంచి చరణ్ – శంకర్ సినిమాను ప్రారంభించడానికి షెడ్యూల్స్ వేస్తున్నారట. ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. చరణ్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలిచేలా చరణ్ 15ను రూపొందించనున్నారట. ఇక శంకర్ ..ఇప్పటికే కమల్ హాసన్ తో ఇండియన్ 2 చిత్రాన్ని మొదలు పెట్టి దాదాపు 80 శాతం పూర్తి చేశాడు. ఆ మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తే గానీ చరణ్ సినిమాను మొదలు పెట్టే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది. కానీ అవన్నీ వట్టి గాలి వార్తలే అని శంకర్ మాత్రం చరణ్ 15 ను ఎట్టి పరిస్థితుల్లోను సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని రెడీ అవుతున్నాడట.
Ram charan : కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం.
అయితే దీనికి సంబంధించి మరో లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను నిన్నా మొన్నటి వరకు తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కించి మిగతా భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారట. అంటే మూడు భాషలలోనూ శంకర్ ఒకేసారి చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి మరింత క్లారిటీ రావాలంటే అధికారక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక ఈ పాన్ ఇండియన్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!