Sunil: కన్‌ఫ్యూజన్‌గా సాగుతున్న సునీల్ కెరీర్..రామ్ చరణ్ – శంకర్ సినిమాతోనైనా సెట్ అవుతుందా..?

Share

Sunil: ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అంటే సునీల్ అని చెప్పాల్సిందే. ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ లాంటి వారికి కూడా దక్కకుండా వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోలు కూడా సునీల్ ఉండాలని దర్శక, నిర్మాతలకి చెప్పే స్థాయికి చేరుకున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్‌కి అత్యంత సన్నిహితుడైన సునీల్ కెరీర్ ప్రారంభంలో ఆయన రాసిన సినిమాలలోనే మంచి పాత్రలో నటించి క్రేజ్ తెచ్చుకున్నాడు.

is ram charan shanker movie going to give hope to sunil career
is ram charan shanker movie going to give hope to sunil career

ఒక కమెడియన్‌గా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న సునీల్ మెగాస్టార్ చిరంజీవి లాంటి వారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని డాన్సులు కూడా ఇరగదీశాడు. అలా ఇండస్ట్రీలో దాదాపు అందరి స్టార్ హీరోలు – దర్శకుల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలలో అద్భుతమైన పాత్రలు చేశాడు. అయితే సునీల్‌లో ఉండే ఎనర్జీ, కామెడీ టైమింగ్స్ హీరో అయ్యే అవకాశాలను తెచ్చిపెట్టాయి. కమెడియన్‌గా మంచి ఊపు మీదున్నప్పుడే సునీల్‌కి హీరోగా అవకాశాలు రావడంతో హీరోగా చేసేందుకు ఒప్పుకున్నాడు. చాలామంది ఇది కరెక్ట్ డెసిషన్ కాదని వాదించినా కూడా సునీల్ అప్పుడున్న ఊపులో హీరోగా మారడానికి రెడీ అయిపోయాడు.

Sunil: ఆ తర్వాతనే సునీల్‌కి ఇబ్బందులు మొదలయ్యాయి.

అలా హీరోగా నటించిన పూల రంగడు సినిమా హిట్ అయింది. దాంతో ఏకంగా మర్యాద రామన్న సినిమాలో నటించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చి భారీ హిట్ సాధించింది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ తర్వాత సునీల్ రేంజ్ అమాంతం మారిపోయింది. ఇక రాజమౌళి కూడా తన కెరీర్ మొత్తంలో తీసిన సినిమాలకంటే సునీల్‌తో తీసిన మర్యాద రామన్ననే చాలా ఇష్టమని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలా స్టార్ హీరో రేంజ్ తెచ్చుకున్న సునీల్ దాదాపు 10 సినిమాల వరకు హీరోగా నటించాడు. వీటిలో ఓ మూడు నాలుగు సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి.

కానీ ఆ తర్వాతనే సునీల్‌కి ఇబ్బందులు మొదలయ్యాయి. సునీల్ సినిమాలు వరుసగా ప్రేక్షకులకి మొనాటనీ అనిపించి ఆకట్టుకోలేదు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్స్‌గా మిగిలాయి. దాంతో సునీల్ కెరీర్ మొత్తం తారుమారయింది. అటు హీరో అవకాశాలు లేక ఇటు కమెడియన్ అవకాశాలు రాక దాదాపు ఫేడౌట్ అయ్యాడు. దాంతో మళ్ళీ త్రివిక్రం సునీల్‌కి అవకాశాలిస్తూ ఫాంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ గ్యాప్‌లోనే రవితేజ నటించిన సినిమాలో విలన్‌గా నటించి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో సినిమాలలో మంచి రోల్స్ ఇచ్చాడు.

Sunil: శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా సునీల్‌కి పేరు రావడం గ్యారెంటీ.

మళ్ళీ నెమ్మదిగా ఫాంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ముందు చేసినంత పేరు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం సునీల్ కెరీర్ పెద్ద కన్‌ఫ్యూజన్‌గా సాగుతోంది. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం అందుకున్నాడు. శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా సునీల్‌కి పేరు రావడం గ్యారెంటీ. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ తన సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే.


Share

Related posts

విశాఖలో ఆ నియోజకవర్గ ప్రజల కోరిక తిర్చబోతున్న జగన్ సర్కార్..??

sekhar

రవితేజ ‘క్రాక్’.. ఫుల్ ఎంజాయ్ చేశాను అంటున్న మెగా హీరో..!!

sekhar

డియర్ సంచయత గజపతిరాజు! నీకు చెప్పొచ్చేదేమిటంటే…?

Yandamuri