Ram charan – Prabhas: చరణ్ టార్గెట్ ప్రభాస్..అందుకే ఇలాంటి ప్లాన్స్ వేస్తున్నాడా..?

Share

Ram charan – Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కటంటే ఒకటి మీడియం బడ్జెట్ సినిమా కమిటవలేదు. ఇప్పటి వరకు 5 సినిమాలు కమిటయ్యాడు. ఆ 5 సినిమాల బడ్జెట్ వందల కోట్ల పైనే. ఒక్కో సినిమా బడ్జెట్ కనీసం 300 కోట్ల వరకు ఉంటోంది. వైజయంతీ మూవీస్ వారు తమ సంస్థలో నిర్మించే 50వ సినిమాను ప్రభాస్‌తో చేస్తున్నారు. దీపిక పదుకోణ్ హీరోయిన్‌గా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లకి పైనే అని తెలుస్తోంది.

is ram-charan-target prabhas...?
is ram-charan-target prabhas…?

అంతేకాదు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా బడ్జెట్ కూడా 600 కోట్లకి పైగానే అని చెప్పుకుంటున్నారు. ఇక సలార్ సినిమా బడ్జెట్ 200 కోట్లని సమాచారం. ఇక 2022, జనవరి 14న అత్యంత భారీ స్థాయిలో రాబోతున్న రాధే శ్యామ్ సినిమా బడ్జెట్ 250 కోట్లకు పైగానే ఉంది. ఇలా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే ప్రభాస్ చేస్తున్నాడు. ఏదైనా పాన్ ఇండియన్ సినిమానే. 100 కోట్ల లోపు సినిమా చేయడానికి ప్రభాస్ నో అంటున్నాడు. ఆదిపురుష్ సినిమాకు 50 రోజులు డేట్స్ ఇచ్చాడట. ఒక్కో రోజుకు 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. అంటే ఒక్క ఆదిపురుష్ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ 150కోట్లు అనుకోవచ్చు.

Ram charan – Prabhas: చరణ్ చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో..!

ఈ రేంజ్‌కు రావాలని ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్స్ అందరూ పట్టుదలగా ఉన్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాను ఇటీవలే పూర్తి చేసిన చరణ్ శంకర్ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. లైన్‌లో యూవీ వారు నిర్మించే సినిమా ఉంది. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమా. ఇదే కాదు ఇకపై కూడా చరణ్ చేసే ప్రతీ సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మీడియం బడ్జెట్ సినిమాలకు ఇక గుడ్‌బై అంటున్నాడట. ఒకరకంగా చరణ్ టార్గెట్ ప్రభాస్ అని చెప్పుకుంటున్నారు. ఒక్క చరణ్ మాత్రమే దాదాపు అందరు పెద్ద హీరోలు ఇప్పుడు ప్రభాస్‌ను టార్గెట్‌గా పెట్టుకునే సినిమాలను ఎంచుకుంటున్నారు.


Share

Related posts

” ఆ రోజు ఒక ఫోన్ వచ్చింది .. లిఫ్ట్ చేయగానే అతను చెప్పింది విని మైండ్ బ్లాక్ అయ్యింది ” సాయి ధరం తేజ్

Naina

జగన్ – మోది కుల రాజకీయం – లోకేష్

sarath

అది రియల్ కాదా… ఫేకేనా? 

sekhar