Ram : గబ్బర్ సింగ్.. టాలీవుడ్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. శృతి హాసన్ కి ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. అంతక ముందు పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా తీసిన నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాతో భారీగా లాభాలను పొందాడు. చెప్పాలంటే ఈ సినిమా పవర్ స్టార్, దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ శృతి హాసన్, నిర్మాత బండ్ల గణేష్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ లకి ఎంతో ప్రత్యేకమైన సినిమా.
ఇక మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో ఊహించని సక్సస్ అందుకున్న సినిమా క్రాక్. మూడేళ్ళ నుంచి సక్సస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో సాలీడ్ హిట్ ని సక్సస్‌ని అందుకున్నాడు. అప్పుడు గబ్బర్ సింగ్ లైఫ్ ఇస్తే ఇప్పుడు కార్క్ సినిమాతో శృతి హాసన్ కి లైఫ్ వచ్చింది. ఈ సినిమా కూడా మూడేళ్ళ నుంచి ఫాంలో లేని దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ, హీరోయిన్ శృతి హాసన్ లకి గొప్ప విజయాన్ని అందించింది. అంటే మన సౌత్ లో పోలీస్ కథలు ఎంతగా ఆదరించబడతాయో అర్థమవుతోంది.
Ram : ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నుంచి రామ్ ఎక్కువగా మాస్ కథాంశాలనే ఎంచుకుంటున్నాడు.
ఒక్క సౌత్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా పోలీస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కాగా ఇలాంటి అదిరిపోయో కథలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించబోతున్నట్టు తాజా సమాచారం. రీసెంట్ గా రామ్ ..తన కొత్త ప్రాజెక్ట్‌ని తమిళ దర్శకుడు ఎన్.లింగు స్వామితో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు లింగు స్వామి రామ్ ని ఎనర్జిటిక్ పోలీస్ క్యారెక్టర్లో చూపించబోతున్నాడట. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నుంచి రామ్ ఎక్కువగా మాస్ కథాంశాలనే ఎంచుకుంటున్నాడు. చూడాలి మరి ఈ సినిమాలో రామ్ ఎలా కనిపించబోతున్నాడో.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!