Ram pothineni : రామ్ పోతినేని.. టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. డాన్సులు, ఫైట్లు, పర్ఫార్మెన్స్ ..ఏదైనా చాలా ఈజ్ తో ఎనర్జీతో చేస్తాడు. యంగ్ హీరోల్లో ఆయనకున్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా క్లాస్ సినిమాలే చేసి హిట్స్ అందుకున్నాడు. కానీ ఓ మాస్ హిట్ కోసం చాలా ట్రై చేశాడు. ఆయన మాస్ హిట్ కొట్టాలనుకున్న ప్రతీసారి రివర్స్ లో దెబ్బ పడింది. జగడం లాంటి సినిమానే. మ్యూజికల్ గా ఈ సినిమా పెద్ద హిట్. కానీ సినిమా ఫ్లాప్. అలా మరికొన్ని మాస్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ భారీ మాస్ హిట్ ఇచ్చింది. రామ్ పోతినేని లో ఉన్న అసలు సిసలు మాస్ హీరో బయటకి తీసుకు వచ్చాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని ఎక్కువగా మాస్ ఎంటర్టైనర్స్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నుకుంటున్న సినిమాలు పూర్తిగా మాస్ జోనర్లో ఉంటున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వా రామ్ పోతినేని నటించిన రెడ్ మంచి కమర్షియల్ హిట్ సాధించింది.
Ram pothineni : రామ్ పోతినేని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడట.
దాంతో మాస్ సినిమాలకే సైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రామ్ పోతినేని..తమిళ దర్శకుడు ఎన్. లింగు స్వామికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది కూడా కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ రామ్ పోతినేని – ఎన్. లింగు స్వామి సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడట. ఈ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చిత్ర బృందం అంటోందట. చూడాలి మరి ఈ మాస్ ఎంటర్టైనర్ తో రామ్ పోతినేని కి ఏ రేంజ్ సక్సెస్ వస్తుందో.