Rang de : రంగ్ దే..యూత్ స్టార్ నితిన్ – యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమా రిలీజ్ కి ముందు పోస్టర్, టీజర్, ట్రైలర్ ..సింగిల్ సాంగ్స్ తో విపరీతంగా హైప్ వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజైంది. ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. హిట్ టాక్ కూడా వచ్చింది. కానీ కరోనా ఎఫెక్ట్ తో పాటు సెకండ్ వీక్ నుంచి నెమ్మదిగా కలెక్షన్స్ డ్రాపవడంతో లాస్ మూవీగా మిగిలింది.
దాంతో భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చిన ఆ ఫాం ని కంటిన్యూ చేయాలనుకుంటే చెక్ సినిమాతో దెబ్బ పడింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్న నితిన్ కి నిరాశ తప్పలేదు. దాంతో రంగ్ దే మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇది కూడా నితిన్ కి షాకిచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమాని జూన్ 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్కి రెడీ అయింది. మరి ఓటీటీలో ఈ సినిమా సత్తా చాటుందా లేక అక్కడ కూడా చతికిల పడుతుందా చూడాలి.
Rang de : నితిన్ మాస్ట్రోతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
ఇక నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ట్రో టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే రిలీజై అభిమానులను ..ప్రేక్షకులను ఆకట్టుకుంది. పియానో ప్లేయర్గా నితిన్ నటిస్తుండగా ఆయనకి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే కనిపించిన పాత్రలో నభా కనిపించబోతోంది. టబు పాత్రలో ఇక్కడ మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. చెక్, రంగ్ దే సినిమాలతో డిసప్పాయింట్ అయిన నితిన్ మాస్ట్రోతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.