Rashmika mandanna : మరో పాన్ ఇండియన్ సినిమాలో రష్మిక..?

Share

Rashmika mandanna : ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలలో పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలన్నీ ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలే. పాన్ ఇండియన్ సినిమా అంటే యూనివర్సల్ కథ, కథనాలతో పలు భాషల నుంచి మార్కెట్ ఉన్న నటీ నటులను ఎంచుకొని భారీ బడ్జెట్ ను కేటాయించి నిర్మిస్తున్నారు. అంతేకాదు కనీసం 4 భాషలలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. దాంతో హీరోతో పాటు హీరోయిన్ కూడా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ స్టార్ గా వెలుగుతున్న వారినే తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లలో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ ఉన్న వాళ్ళు పూజా హెగ్డే, రష్మిక మందన్న, కియారా అద్వానీ.

is rashmika-mandanna- in another pan indian movie....?
is rashmika-mandanna- in another pan indian movie….?

వీరిలో ముగ్గురికి సమానమైన క్రేజ్ ఉంది. దాదాపు ఈ ముగ్గురు ఒకే రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే కాస్త ఎక్కువ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది మాత్రం రష్మికమందన్న. తాజాగా ఈమెకి మరో పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం దక్కిందని తెలుస్తోంది. తెలుగులో పాన్ ఇండియన్ సినిమా పుష్ప తో పాటు శర్వానంద్ నటిస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు చేస్తోంది. అలాగే హిందీలో బిగ్ బి అమితాబ్ తో గుడ్ బై, సిద్దార్థ మల్‌హోత్రా సరసన నటిస్తోంది. అలాగే మరో ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. త్వరలో దానిని అధికారకంగా ప్రకటించనున్నారు.

Rashmika mandanna : రష్మిక మందన్నను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.

కాగా ఇప్పుడు అనుదీప్ కె వి దర్శకత్వంలో రూపొందనున్న పాన్ ఇండియన్ సినిమాలో రష్మికని హీరోయిన్ గా ఎంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. రీసెంట్ గా జాతిరత్నాలు తో స్టార్ డైరెక్టర్ గా పాపులర్ అయిన అనుదీప్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనే ఒకేసారి తెరకెక్కించి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి రానుందట. ఇందులో రష్మిక మందన్నను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.


Share

Related posts

గుడ్ న్యూస్ : ఐపీఎల్ కు లైన్ క్లియర్..! ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అంటే…

arun kanna

Kisses: ఈ రక రకాల ముద్దుల గురించి  తెలుసుకుని ట్రై చేస్తే.. మీ భాగస్వామి దాసోహం అనాల్సిందే !!(పార్ట్ -1)

siddhu

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై హైకోర్టులో పాల్ పిటిషన్

somaraju sharma