Romantic : రొమాంటిక్ అన్న టైటిల్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా ఒక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్- పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్- ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ కీలక పాత్రను పోషించారు. హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే ఒక ముఖ్య పాత్రలో నటించారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కి రెడీ అయింది. థియేటర్స్ మూత పడి ఉన్నప్పుడే ఓటీటీ రిలీజ్ చేస్తారన్న టాక్ వచ్చిది.
కానీ ఇంతలో థియోటర్స్ ఓపెన్ చేసుకునేందుకు బొమ్మ పడేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఓటీటీ రిలీజ్ కాకుండా నేరుగా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు పూరీ బృందం ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇదుగో అదుగో రొమాంటిక్ సినిమా రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది తప్ప మేకర్స్ మాత్రం ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే సంక్రాంతి నుంచి టాలీవుడ్ లో వరసగా నెలలో మూడు నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి.
Romantic : రొమాంటిక్ సినిమా ఎందుకు రిలీజ్ చేయడం లేదు..?
ఈ క్రమంలో రొమాంటిక్ సినిమా ఎందుకు రిలీజ్ చేయడం లేదన్న టాక్ అభిమానుల్లో ఉందట. అయితే సరైన డేట్ రొమాంటిక్ సినిమాకి దొరకడం లేదని తెలుస్తోంది. పెద్ద సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసుకొని ఉన్నాయి. అందుకే పూరి టీం ఆలోచనలో పడ్డారట. కాగా తాజాగా ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తారని చెపుకుంటున్నారు. మరి థియోటర్స్ లో కొత్త వాళ్ళతో తీసిన సినిమాలే రిలీజ్ చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్ కొడుకు సినిమా ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారని మాట్లాడుకుంటున్నారట. మరి మేకర్స్ రొమాంటి సినిమా విషయంలో డైలమాలో ఉన్నారా లేక మరేదైనా కారణమా అన్నది క్లారిటీ ఇస్తేనే ఈ రూమర్స్ ఆగుతాయి.