RRR: ఇక అలాంటి ఆలోచనలన్నీ దండగ..అందుకే రాజమౌళి బృందం డ్రాపయ్యారా..?

Share

RRR: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ ( RRR ) ఒకటి. బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటించిన ఈ భారీ మల్టీ స్టారర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు రాజమౌళి. నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఈ సినిమా కోసం దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించి నిర్మిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో రూపొందుతున్న అన్నీ సినిమాల కంటే ఆర్ఆర్ఆర్ మీదే అందరి చూపు ఉంది.

is rrr-dubai event cancelled...?
is rrr-dubai event cancelled…?

అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌ను రాజమౌళి ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 10 భాషలలో రిలీజ్ చేయబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌కు ఆయా భాషలలోని స్టార్ హీరోలను ఆహ్వానించనున్నారని ప్రచారం జరుగుతంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను రప్పించేందుకు రాజమౌళి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం దుబాయ్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

RRR: మళ్ళీ కొవిడ్ ప్రభావం మొదలైంది.

ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్స్, టాలీవుడ్ నుంచి మెగా నందమూరి ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు..పలువురు ఇండస్ట్రీ వర్గాలు..సౌత్‌లోని ఇతర భాషల సినీ ప్రముఖులను రాజమౌళి ఆహ్వానించనున్నారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు రాజమౌళి బృందం ఆ ఆలోచన విరమించుకున్నారని లేటెస్ట్ న్యూస్ ఒకటి వచ్చి వైరల్ అవుతోంది. అందుకు కారణం మళ్ళీ కొవిడ్ ప్రభావం మొదలైంది. దీని ప్రభావం విదేశాలలో కొన్ని చోట్ల తీవ్రంగా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కొవిడ్ బారిన పడ్డారు. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను దుబాయ్‌లో నిర్వహించకూడదని డిసైడయినట్టు సమాచారం.


Share

Related posts

జగన్ అనూహ్య మార్పు వెనుక…! ముందు…!!

Srinivas Manem

శహబాష్ వాయుసేనా!

Siva Prasad

Karthika Deepam : కార్తీకదీపంలో డాక్టర్ బాబు పాత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన.. నిరుపమ్!

Teja