RRR : ఆర్ఆర్ఆర్ ..ప్రపంచవ్యాప్తంగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ప్రముఖ సంస్థలు శాటిలైట్, స్ట్రీమింగ్ రైట్స్ అందుకున్నారు. టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు యంగ్ హీరోలు అయిన మెగా పవర్ స్టార్ రాం చరణ్, జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారి నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. ఇద్దరు హీరోలు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా మారబోతున్నారు. ఇప్పటికే వీరి పాత్రలతో వచ్చిన టీజర్స్ భారీ ఎత్తున పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
అయితే సంవత్సరం నుంచి పోస్ట్‌పోన్ అవుతున్న ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 13న అన్నీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని రాజమౌళి బృందం అధికారంగా ప్రకటించారు. అయితే తాజా ఈ సినిమా రిలీజ్ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి బృందం. ఆలియా భట్ మీద కాంబినేషన్ సీన్స్ తో పాటు సాంగ్ కూడా చేయాల్సి ఉంది.
RRR : ఆర్ఆర్ఆర్ 2021 లో రిలీజ్ అవడం అసాధ్యమని ప్రచారం జరిగింది.
అలాగే కొన్ని క్లైమాక్స్ సీన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇక వీఎఫెక్స్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉందట. దాంతో ప్రకటించినట్టుగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయలేరని తెలుస్తోంది. అంతేకాదు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022, 26న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ టాక్ ముందు నుంచి ఉంది. ఆర్ఆర్ఆర్ 2021 లో రిలీజ్ అవడం అసాధ్యమని ప్రచారం జరిగింది. పరిస్థితులు చూస్తుంటే ఇపుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. అజయ్ దేవగణ్, శ్రీయ శరణ్, ఓలివియా మోరీస్ సహా పలువురు హాలీవుడ్, బాలీవుడ్ నటీ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.