RRR : ఆర్.ఆర్.ఆర్, సర్కారు వారి పాట.. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ని ఇప్పటికే ఆయా చిత్ర యూనిట్ లాక్ చేసుకున్నాయి. ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ 13 న రిలీజ్ చేస్తున్నట్టు దర్శక ధీరుడు రాజమౌళి బృందం ప్రకటించగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాని ఇంకా అఫీషియల్ గా మాత్రం డేట్ ఫిక్స్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ మారినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మహేష్ బాబు సర్కారు వారి పాట శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దుబాయ్ లో ఇప్పటికే నెల రోజుల షెడ్యూల్ కంప్లీట్ అయింది. కాగా నెక్స్ట్ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈనెల 22 నుంచి సర్కారు వారి పాట దుబాయ్ లో సెకండ్ షెడ్యూల్ మొదలవనుందని అంటున్నారు. అంతేకాదు అన్నీ అనుకున్నట్టు పూర్తైయితే సర్కారు వారి పాట ప్రీపోన్ అయి విజయదశమి పండుగ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పరశురాం తెరకెక్కిస్తున్నాడు.
RRR : ఆర్.ఆర్.ఆర్ 2022 సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది.
కాగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ డిలే అవుతుండటం తో అనుకున్న రిలీజ్ డేట్ సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమన్న టాక్ వినిపిస్తోంది. రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. విజువల్ వండర్ లా తీర్చుదిద్దే క్రమంలో అన్ని షెడ్యూల్స్ అనుకున్న సమయానికి పూర్తవడం లేదట. రామ్ చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ కోసం ట్రిపుల్ ఆర్ షూట్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అలియా భట్ కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సి రావడం మరొక కారణం. దీనికి తోడు ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి చాలా సమయమే పట్టేస్తుందని అంటున్నారు. దాంతో అక్టోబర్ కి సినిమా రెడీ అయ్యే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. అందుకే రాజమౌళి 2022 సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది.