సాయి పల్లవి, కృతి శెట్టి ఆ స్టార్ హీరోయిన్స్ ఇద్దరినీ రీప్లేస్ చేయబోతున్నారా ..?

సాయి పల్లవి ఫిదా సినిమా సూపర్ హిట్ తర్వాత టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. నేచురల్ పర్ఫార్మెన్స్ తో హీరోలకే కొన్ని సీన్స్ లో గట్టి పోటీ ఇస్తోంది. హీరోలు కూడా sai pallavi తో నటించాలంటే గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా వెలుగుతున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నల కి ఉన్న క్రేజ్ sai pallavi కి ఉండటం విశేషం. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

నాగ చైతన్య కి జంటగా లవ్ స్టోరీ సినిమా కంప్లీట్ చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుండగా ఫిదా లాంటి డీసెంట్ హిట్ సాధిస్తుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉన్నారు. అలాగే నాని తో శ్యాం సింగ్ రాయ్ సినిమాలో నటిస్తోంది sai pallavi. రానా దగ్గుబాటి తో విరాట పర్వం సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలన్ని రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే ఇక sai pallavi కి టాలీవుడ్ లో తిరుగుండదు. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇక ఉప్పెన సినిమాతో దూసుకొచ్చింది కుర్ర బ్యూటి కృతి శెట్టి. మొదటిసినిమా రిలీజ్ కాకుండానే కేవలం నీ కన్ను నీలి సముద్రం అన్న ఒక్క సాంగ్ తో ప్రేక్షకులను .. టాలీవుడ్ మేకర్స్ ని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం krithi shetti కి టాలీవుడ్ లో వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని తో రెండవ సినిమాగా శ్యాం సింగ్ రాయ్ చేస్తోంది. ఇక అఖిల్ సినిమా లో కూడా నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే రాబోవు రోజుల్లో సాయి పల్లవి, krithi shetti ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా ఉన్న pooja hegde – rashmika mandanna లని రీప్లేస్ చేస్తారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.