Samantha: సమంత శాకుంతలం సినిమాకి మైనస్ అయితే దర్శకుడు గుణశేఖర్ పరిస్థితేంటీ..?

Share

Samantha: సమంత..ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే రక రకాల చర్చలు సాగుతున్నాయి. ఇటీవల నాగ చైతన్యతో తెగ తెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా సమంత – నాగ చైతన్య విడివిడిగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా కూడా అక్కినేని అభిమానులు మాత్రం అవన్నీ కేవలం రూమర్స్, గాసిప్స్ అని చెప్పుకున్నారు. ఇండస్ట్రీ వర్గాలలో కూడా చాలామంది సమంత – నాగ చైతన్యలది చూడ ముచ్చటైన జంట. ఇద్దరు ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అలాంటిది విడిపోయే అవకాశాలే లేవని నమ్మకంగా ఉన్నారు.

 is Samantha becomes minus for Shaknthalam movie...?
is Samantha becomes minus for Shaknthalam movie…?

అయితే నెలరోజుల నుంచి సమంత – నాగ చైతన్య విడిగా ఉంటున్నారనే వార్తలు వచ్చి వైరలవడంతో పాటు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ నాకు చైతూతో చెడిందనే సంకేతాలు ఇస్తూ వచ్చింది. మధ్యలో నాగ చైతన్య టీమ్ కి విషెస్ చెప్పి, అలాగే నాగార్జున బర్త్ డేకి విషేస్ చెప్పి కొంత కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేసింది. దీంతో సమంత – నాగ చైతన్యల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని సినిమాల పరంగానే ఎవరి పనుల్లో వారు బిజీ అవడంతో వేరేగా ఉంటున్నారని అభిమానులు మళ్ళీ మాట్లాడుకున్నారు. ఇలా అవును, కాదు అనే పెద్ద కన్‌ఫ్యూజన్స్ మధ్య సమంత – నాగ చైతన్యలు పెద్ద షాకిస్తూ మేము విడిపోతున్నామని ప్రకటించారు.

 

Samantha: సమంత మూవీస్‌ని అక్కినేని ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ ఆదరిస్తారా..?

ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొత్త వార్తలు మొదలయ్యాయి. సమంత – నాగ చైతన్య విడిపోవడానికి కారణం సమంత ఫ్యాషన్ డిజైనర్ ప్రతీక్ జవాల్కర్ అని, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ అని ఇలా రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనికంటే మరీ ముఖ్యంగా ఆమె హిందీలో నటించిన ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఓ కారణం అని అంటున్నారు. ఇందులో ఆమె కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలలో నటించిందని అవి అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని..అక్కడి నుంచే సమంత – చైతన్యల మధ్య సమస్యలు తలెత్తి తారాస్థాయికి చేరుకున్నాయని వార్తలు హోరెత్తిపోయాయి.

ఏది ఏమైనా వారు విడిపోయారు. అయితే ఇప్పుడు సమంత, నాగ చైతన్య నిజ జీవితంలో కలిసి జీవించకపోయినా కూడా సినిమాలో కలిసి నటించాలని అభిమానులు కొత్త కోరికలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే సమంత నటించే సినిమా మీద ఇప్పుడు నెగిటివ్ టాక్ ఉంటుందా అనేది మరో కొత్త టాపిక్ మొదలైంది. ఇకపై సమంత కొత్త మూవీస్‌కి సైన్ చేస్తే ఎలాంటి మూవీస్ ఒప్పుకుంటుంది. ఆ మూవీస్‌ని అక్కినేని ఫ్యాన్స్, దగ్గుబాటి ఫ్యాన్స్ ఆదరిస్తారా అనేది కొత్తగా పుట్టుకొస్తున్న సందేహాలు. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసిన శాకుంతలం సినిమా పరిస్థితేంటో అంటూ మాట్లాడుకుంటున్నారు.

Samantha: శాకుంతలంపై సమంత, నాగ చైతన్య డివోర్స్ ఎఫెక్ట్..?

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న పౌరాణిక చిత్రంలో కావ్య నాయకి శకుంతలగా సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఆమెకి జంటగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సమంత ఇప్పుడు చైతూతో విడాకులు తీసుకున్న కారణంగా దీని నెగిటివ్ ఇంపాక్ట్ శాకుంతలం సినిమా మీద బాగానే పడే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా నిర్వహిస్తారు..గెస్టులుగా ఎవరు వస్తారూ..సినిమాకి సపోర్ట్ ఉంటుందా అనేది ఇప్పుడు చాలామందిలో కలుగుతున్న అనుమానాలట. చూడాలి మరి శాకుంతలంపై సమంత, నాగ చైతన్య డివోర్స్ ఎఫెక్ట్ ఏమేరకు ఉంటుందో.

 


Share

Related posts

జ‌గ‌న్ ఇంకో సంచ‌ల‌న ప‌థ‌కం… ఇది ప్ర‌జ‌ల ద‌శ మార్చేస్తుంది

sridhar

Varalakshmi : వరలక్ష్మీ కి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్..

GRK

Breaking: ఈనెల 21 లేదా 22 న అసెంబ్లీ సమావేశాలు..!!

P Sekhar