The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మీదే సమంత బాలీవుడ్ ఎంట్రీ డిసైడయిందా..?

Share

The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ..తాజాగా బాలీవుడ్ ఈ వెబ్ సిరీస్ ని దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 1’కి సీక్వెల్ గా దీనిని రూపొందించిన సంగతి తెలిసిందే. వాస్తవంగా ఈ వెబ్ సిరీస్ గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా ఒక కారణం అయితే వీఎఫెక్స్ మరొక కారణం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ వెబ్ సిరీస్ తో మొదటిసారి సమంత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. గత కొన్నేళ్ళుగా సమంత హిందీ సినిమాలలో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

is samantha bollywood entry will be decided by the-family-man-2
is samantha bollywood entry will be decided by the-family-man-2

బాలీవుడ్ నుంచి సమంతకి ఆఫర్స్ కూడా బాగానే వచ్చాయి. కానీ రెండు కారణాల వల్ల సమంత హిందీ సినిమాలను ఒప్పుకోలేకపోయింది. ఒకటి ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలలో నటిస్తూ విపరీతమైన బిజీగా ఉంది. ఈ సినిమాలకే సమయం కేటాయించలేకపోయింది. ఇక మరొక కారణం బాలీవుడ్ లో ఎంట్రీ గ్రాండ్ గా జరిగినా కూడా ఒకవేళ సక్సెస్ దక్కకపోతే అక్కడ క్రేజ్ సంగతి అలా ఉంచితే ఇటు సౌత్ లో క్రేజ్ ఎక్కడ పడిపోతుందో అనేదే తన భయం.

The family man 2 : ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కి ఒకే చెప్పి షాకిచ్చింది.

అందుకే ఇంతకాలం బాలీవుడ్ ఎంట్రీకి నో చెప్పింది. అయితే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కి ఒకే చెప్పి షాకిచ్చింది. ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో ఏమాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పింది. అయితే ఇటీవల ట్రైలర్ రిలీజయ్యాక విమర్శలు ఎదుర్కొంటున్న ఈ వెబ్ సిరీస్ మీదే సమంత బాలీవుడ్ ఎంట్రీ ఆధారపడి ఉందంటున్నారు. ఇది గనక హిట్ అయితే డైరెక్ట్ గా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. లేదంటే అప్పుడు తన డెసిషన్ ఎలా ఉండబోతుందో చెప్పలేము. చూడాలి మరి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సమంత బాలీవుడ్ ఎంట్రీని ఎలా డిసైడ్ చేస్తుందో.


Share

Related posts

Mahesh Babu: ఏర్పాట్లు చేసుకుంటున్న మహేష్ బాబు అభిమానులు..??

sekhar

SEC : ఎస్ఈసీ సంచలన నిర్ణయం – ఈ నెల 21 వరకూ మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టు?

somaraju sharma

Rashmi Gautam Bule Saree Pics

Gallery Desk