Samantha : సమంత అక్కినేని నాగ చైతన్య అక్కినేనిని పెళ్ళి చేసుకున్నాక కమర్షియల్ సినిమాలంటే ఆసక్తి చూపించడం లేదు. చైతుని పెళ్లాడక ముందు గ్లామర్ పాత్రలలో నటించడానికి తెగ ఆసక్తి చూపించింది. పక్కా కమర్షియల్ సినిమాలనే ఎంచుకుంది. వరుసగా ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ తమిళ సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ స్టార్ హీరోతో ఛాన్స్ వచ్చినా కూడా నో చెప్పేది కాదు. కథ లో కాస్త తన పాత్ర అటు ఇటుగా ఉన్నా ఒకే చెప్పిన సినిమాలున్నాయి. అందుకే ఒక వెలుగు వెలిగింది. బ్లాక్ బస్టర్ సినిమాలతో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ కూడా అందుకుంది.
కానీ చైతన్యని పెళ్ళాడాక మాత్రం ఆ కమర్షియల్ సినిమాలను ఒప్పుకోవడం లేదు. మజిలీ సినిమా సమంతకి మంచి పేరు తెచ్చిపెట్టింది. చైతన్య కి కెరీర్ లో ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ అని చెప్పక తపదు. పెళ్ళి తర్వాత భార్య భర్త కలిసి నటించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఇద్దరు కలిసి బల్క్ గా పారితోషికం తీసుకున్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. అప్పటి నుంచే మజిలి లాంటి కథ ఎవరైనా చెప్తే చేయాలని ఆకస్తిగా చూస్తున్నారట. ఇద్దరు కలిసి మజిలి లాంటి సినిమా కథ చెప్పే రైటర్స్ కోసం డైరెక్టర్ కోసం సర్చ్ చేస్తున్నారని వినికిడి.
Samantha : మజిలీ లాంటి కథ ఏ దర్శకుడు చెప్తాడో..?
ఓ బేబి సినిమా చేసిన సమంతకి ఇది కూడా హిట్ ఇచ్చింది. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె దర్శకత్వంలో ఇద్దరు నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారం మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోందట. స్టార్ డైరెక్టర్స్ కి ఇద్దరు కలిసి నటించే ఫ్యామిలీ కథ ఉంటే తీసుకు రమ్మని చెప్పారట. ది ఫ్యామిలీ మాన్ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించి బాలీవుడ్ లో కూడా సమంత అడుగు పెట్టింది. ఒక తమిళ సినిమా అలాగే శాకుంతలం అనే సినిమాలో కూడా సమంత నటిస్తున్నారు. మరి మజిలీ లాంటి కథ ఏ దర్శకుడు చెప్తాడో చూడాలి.