Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన లేటెస్ట్ సినిమా పుష్ప. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటిభాగం పుష్ప: ది రైజ్ పార్ట్ 1 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తోనే దూసుకెళుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్..ముత్తం శెట్టి మీడియాతో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా.

అలాగే నిర్మాణ సంస్థకు, దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న ..ఇలా చిత్ర యూనిట్ సభ్యులందరికీ పుష్ప: ది రైజ్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఇక తెలంగాణలో ఈ సినిమాకు ప్రభుత్వం అదనపు షో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడం కూడా బాగా కలిసి వచ్చింది. ఇక ఈరోజు వచ్చిన పుష్ప సినిమాదే ఎక్కడ చూసిన సందడంతా. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ టాక్‌తో సినిమా మీద పెట్టుకున్న అంచనాలు అందుకునే దిశగా దూసుకెళుతోంది.
Pushpa: అనుకున్నంత హైలెట్ కాలేదనే నెగిటివ్ టాక్ వినిపిస్తోంది.
రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం కూడా పుష్ప సినిమాకు ప్లస్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు వరకు వచ్చిన అన్నీ సాంగ్స్‌ను వెనక్కి నెట్టి సమంత చేసిన స్పెషల్ సాంగ్ బాగా ట్రెండ్ అయింది. దాంతో ఇదే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని అందరూ చెప్పుకున్నారు. కానీ దేవీశ్రీప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌లో కాకుండా ఇప్పటివరకు డీఎస్పీ కంపోజ్ చేసిన అన్నీ ఐటెం సాంగ్స్ కంటే ఇది అనుకున్నంత హైలెట్ కాలేదనే నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. ఒకరకంగా సినిమాకు ప్లస్ అవుతుందనుకున్న సమంత సాంగే ఇప్పుడు మైనస్ అంటున్నారు.