న్యూస్ సినిమా

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమంత.. డిప్రెషన్‌లోకి వెళ్లిందా?

Share

సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విడాకుల వ్యవహారం ఎప్పటికీ సినీ అభిమానులు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపికే! వీరు ఇద్దరూ విడిపోయి దాదాపు ఒక సంవత్సరం అవుతోంది. అయినా కూడా సమంత చుట్టూ ఈ తరహా వార్తలు చుట్టుముడుతూనే ఉన్నాయి. డివోర్స్ తర్వాత పుష్ప సినిమాలో సామ్ ‘ఊ అంటావా మామ… ఊఊ అంటావా’ అంటూ చేసిన ఐటమ్ సాంగ్ కూడా పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

సమంత ఆరోగ్యానికి ఏమైంది

Samantha

ప్రస్తుతం ఈ అమ్మడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే సామ్ ‘యశోద’,’శాకుంతలం’ అనే రెండు పాన్ ఇండియా మూవీలలో నటించింది. కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియకపోయినా సామ్ తన పని తను పూర్తిచేసింది. అంతవరకు బానే ఉంది కానీ ప్రస్తుతం సమంత హెల్త్ పరంగా బాగా సఫర్ అవుతుందని, ఆమె డిప్రెషన్ లో ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అందుకే సమంత చేయాల్సిన ఖుషి సినిమా షెడ్యూల్ లేట్ అవుతుందని అంటున్నారు. డిసెంబర్ 23న ఖుషి సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ సమంత ఆరోగ్య కారణాల వల్ల ఖుషి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్‌ని పోస్టుపోన్ చేసినట్లు తెలుస్తుంది.

క్లారిటీ వచ్చేది ఎప్పుడు

Samantha

సమంత ఒక 15 రోజుల వరకు బయటకు రాలేనని తెలిపిందట. అంతేకాకుండా సామ్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లనుందనే న్యూస్ కూడా వినవచ్చింది. అసలు ఇంతకీ నిజంగానే సమంత డిస్టర్బ్ అయిందా? ఆమె ఆరోగ్యానికి ఏమైంది? ఈ ముద్దుగుమ్మ డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిందా? అనే దాని గురించి స్వయంగా సామ్ మాట్లాడితేనే తెలుస్తుంది. ఎందుకంటే సమంత ఏ విషయం గురించైనా ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయి. స్వయంగా తానే ఈ విషయాల గురించి మాట్లాడేవరకు అందరం వెయిట్ చేయక తప్పదు.

 


Share

Related posts

రెడ్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన రాం.. సంక్రాంతి బరిలో రచ్చ రచ్చే ..!

GRK

Sanchita Shetty Beautiful Sunflower Photoshoot

Gallery Desk

‘మోదిని ఆపండి’

sarath