Sangeetha: సెకండ్ ఇన్నింగ్స్‌లో సంగీత సక్సెస్ అందుకుంటే సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్..కానీ ఆ ఛాన్స్ ..?

Share

Sangeetha: సీనియర్ హీరోయిన్స్‌లో సంగీత ఒకరు. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి. హోంలీ క్యారెక్టర్స్‌తో సంగీత బాగా ఆకట్టుకుంది. మెగాస్టార్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించే అవకాశాల కోసం ఎంతగానో సంగీత ఎదురు చూసింది. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈమెకి ఆ అవకాశాలు దక్కలేదు. సంగీత అసలు పేరు రసిక. సినిమాల కోసం సంగీతగా మార్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషలలో సినిమాలు చేసింది. అన్ని ఇండస్ట్రీలలో సంగీతకి మంచి హిట్స్ దక్కాయి. డాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా సంగీత బాగా పేరు తెచ్చుకుంది.

is Sangeetha going to become a good choice if her second innings get success...?
is Sangeetha going to become a good choice if her second innings get success…?

కాస్త బోల్డ్ పాత్రలు చేయడానికి కూడా సంగీత ఏమాత్రం ఆలోచించలేదు. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేసిన సినిమాల వరకు టాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. అయితే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయింది. 1999లో ఆశల సందడి అనే సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత జే.డి.చక్రవర్తి హీరోగా వచ్చిన నవ్వుతూ బ్రతకాలిరా అనే సినిమాలో చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో కోన సీమ కుర్రదాన్నిరో అనే పాట బాగా పాపులర్ అయింది.

Sangeetha: ఖడ్గం సినిమా సంగీత కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటిది.

ఈ సాంగ్ చూసే సంగీతకి కొన్ని అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా సంగీత కెరీర్‌లో మైల్ స్టోన్ లాంటిది. ఇందులో ఆమె ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..నేనేంటో చూపిస్తాను అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్ ఆమెకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఖడ్గం సినిమా తర్వాత సోలో హీరోయిన్ కంటే కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలలోనే అవకాశాలు వచ్చాయి. రవితేజతో చేసిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఆ తర్వాత శ్రీకాంత్ సరసన పెళ్ళాం ఊరెళితే సంగీత కెరీర్‌లో మంచి హిట్స్‌గా నిలిచాయి.

అయితే ఈ సినిమాల తర్వాత ఎందుకనో సంగీతకి తెలుగులో ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు. సంక్రాంతి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి హిట్స్ అందుకున్నప్పటికి సోలో హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకొని స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిది. ఆ రూట్ లో సంగీతని టాలీవుడ్‌లో పెద్దగా ఎంకరేజ్ చేసిన మేకర్స్ లేరనే చెప్పాలి. ఇక 2009లో క్రిష్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న సంగీత కొంతకాలం సినిమాలకి దూరంగా ఉన్నారు. కానీ బుల్లితెర మీద మాత్రం కొన్ని షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఆకట్టుకున్నారు. అలా మళ్ళీ తెలుగు దర్శక నిర్మాతల కళ్ళలో పడిన సంగీత అవకాశాలు వస్తుండటంతో 2020లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

Sangeetha: 10 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా సంగీతలో అదే అందం, అదే ఉత్సాహం.

ఈ సినిమాలో సంగీత పాత్రకి మంచి పేరు వచ్చింది. దాదాపు సినిమాల పరంగా 10 ఏళ్ళు గ్యాప్ వచ్చినా కూడా సంగీతలో అదే అందం, అదే ఉత్సాహం. ఏమాత్రం హీరోయిన్ పాత్రలకి తీసిపోని విధంగా ఫిజిక్‌ని మెయింటైన్ చేస్తూ షాకిచ్చింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అందుకుంది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో చిరు నుంచి మంచి కాంప్లిమెంట్ కూడా అందుకుంది. ఆచార్యలోని లాహే లాహే సాంగ్ గనక సంగీతకి మరింత పేరు తీసుకు వస్తే మాత్రం ఖచ్చితంగా వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది. అంతేకాదు సీనియర్ హీరోలకి ఇప్పుడు హీరోయిన్స్ కొరత బాగా ఉంది. అందుకు సంగీత పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవడం గ్యారెంటీ. చూడాలి మరి ఆమెకి రానున్న రోజుల్లో ఎలాంటి ఆఫర్స్ దక్కుతాయో.


Share

Related posts

దిగొచ్చిన ట్రంప్!

Siva Prasad

AP EX DGP: గుండెపోటుతో ఉమ్మడి ఏపి మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

somaraju sharma

Knee Pain: ఈ నూనెను మోకాళ్ళ చిప్పల పై రాసి మర్దన చేస్తే జన్మలో మోకాళ్ళ నొప్పులు రావు..!!

bharani jella